ప్రస్తుతం సోషల్ మీడియా కారణంగా ఎక్కడ ఏం జరిగినా కూడా అరచేతిలో ఉన్న స్మార్ట్ఫోన్ లో వాలిపోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు వెలుగులోకి వచ్చే ఘటనలు ప్రతి ఒక్కరిని కూడా అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయి. అయితే యాదృచ్ఛికంగా జరిగిందా లేదంటే ఇలా జరగడం వెనక ఏదైనా రహస్యం ఉందా అని అందరికీ అనిపించే విధంగా కొన్ని ఘటనలు వెలుగులోకి వస్తే ఉంటాయి అని చెప్పాలి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే.


సాధారణంగా కవల పిల్లలని ట్విన్స్ అని అంటూ ఉంటారు. అయితే కేవలం నిమిషాల వ్యవధిలోనే ఇలా ట్విన్స్ జన్మించడం చూస్తూ ఉంటాం. అయితే కొన్ని కొన్ని సార్లు ఇలా నిమిషాల వ్యవధిలోనే జన్మించిన వేరువేరు సంవత్సరాలలో ట్విన్స్ జన్మించడం కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. అయితే ఇలా కవలలుగా జన్మించిన వారు ఒకరు మరొకరికి జిరాక్స్ కాపీ  అనే విధంగా ఒకే రకమైన పోలికలను కలిగి ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా ఇప్పటివరకు పోలికలలో ఒక్కరిలాగా ఒకరు సేమ్ ఉంటారు అన్న విషయం అందరికీ తెలుసు.


 కానీ కవలలుగా పుట్టిన వారు అటు మార్కులు సాధించడంలో కూడా సేమ్ ఉంటారు అన్న విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన ద్వారా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. రూపంలోనే కాదు చదువులోనూ తమ సమానమే అని నిరూపించారు కవలలు. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో సూర్యాపేట జిల్లా ఆత్మకూరుకు చెందిన డేగల రామ్, లక్ష్మణ్ ప్రతిభ చూపారు. ఆరో తరగతి నుంచి ఆదర్శ పాఠశాలలోనే చదువుతున్న ఇద్దరు అన్నదమ్ములు.. ఇంటర్ ఫలితాలలో సత్తా చాటారు. ఎంపీసీ విభాగంలో లక్ష్మణ్ 983 మార్కులు సాధిస్తే.. రామ్ 981 మార్కులు సాధించడం గమనార్హం. భవిష్యత్తులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావడమే తమ లక్ష్యం అంటూ చెబుతున్నారు ఈ కవలలు.

మరింత సమాచారం తెలుసుకోండి: