ప్రతి రోజు ఎంతో మంది పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ లేదా డీజిల్ కొట్టించుకుంటూ తమ వాహనాన్ని నడుపుతూ ఉంటారు. కానీ పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ , డీజిల్ తప్ప మరి ఇతర సర్వీసులు కూడా దొరుకుతాయి అని అవి ఫ్రీ గా పొందవచ్చు అని చాలా మంది కి తెలియదు. ఇక పెట్రోల్ బంకుల్లో , నాలుగు రకాల సర్వీస్ లను ఫ్రీ గా పొందవచ్చు అవి ఏమిటో తెలుసుకుందాం. మనం రోడ్డు పై వెళ్తున్నప్పుడు మన వాహనంలో గాలి లేనట్లు అయితే రోడ్డు పక్కన ఎక్కడో కొట్టిస్తూ డబ్బులు ఇస్తూ ఉంటాం. అలా కాకుండా పెట్రోల్ బంకుల్లో ఉచితంగా గాలి నింపే సౌకర్యం ఉండాలి.

అక్కడ ఎలాంటి డబ్బులు తీసుకోకుండా మనకు వాహనాల్లో వాళ్ళు గాలిని నింపాలి. ఇక రెండవది కచ్చితంగా ప్రతి పెట్రోల్ బంకులో తాగు నీరు వసతి ఉండాలి. మనం పెట్రోలు కొట్టించిన , కొట్టించకపోయినా అక్కడ తాగు నీరు తాగవచ్చు. అలాగే బాటిల్స్ లో కూడా పట్టుకుని వెళ్ళవచ్చు. ఇక మూడవ సర్వీస్ విషయానికి వస్తే అత్యంత శుభ్రమైన బాత్రూం ఫెసిలిటీ ఎవరికైనా బాత్రూం రూమ్ వచ్చినట్లు అయితే వెంటనే వెళ్లడానికి కచ్చితంగా ప్రతి పెట్రోల్ బాంక్ లో బాత్రూం ఉండాలి.

అది కూడా చాలా శుభ్రంగా ఉండాలి. ఇక నాలుగవది చివరిది ఫ్రీ ఫస్ట్ ఎయిడ్ కిట్. మనం రోడ్డు మీద వెళుతున్నప్పుడు మనకు ఏమైనా యాక్సిడెంట్లు జరిగినట్లు అయితే హాస్పటల్ వెళ్లే లోపు దగ్గరలో పెట్రోల్ బంక్ ఉన్నట్లు అయితే అక్కడ మనకు వారు ఫ్రీ గా ఫస్ట్ ఎయిడ్ చికిత్స చేయవలసి ఉంటుంది. ఇలా పెట్రోల్ బంకుల్లో డబ్బులు ఇచ్చి పెట్రోల్ మరియు డీజిల్ నింపుకోవడం మాత్రమే కాకుండా ఈ నాలుగు సర్వీస్ లను కూడా పెట్రోల్ బంకులు ఫ్రీ గా ప్రజలకు అందించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: