ప్రపంచాన్ని ఇప్పుడు కరోనా మహమ్మారి పట్టి పీడిస్తున్న విషయం తెలిసిందే.  కరోనా దెబ్బతో శుభకార్యాలు పూర్తిగా పోస్ట్ పోన్ కావడమో.. అతి కొద్ది మంది సమక్షంలో పెళ్లిళ్లు, ఎంగేజ్ మెంట్, పుట్టిన రోజు వేడుకలు జరుగుతున్నాయి.  అది కూడా రూల్స్ ప్రకారం.. అంటే శానిటైజేషన్, మాస్క్, సోషల్ డిస్టెన్స్ ఇలా.. అని నియమాలు పాటిస్తూ శుభకార్యాలు జరుగుతున్నాయి. ఇక ఈ సమయంలో బంగారం రేటు అమాంతం పడిపోతుందని అనుకున్నారు వినియోగదారులు.  కానీ ఇక్కడే ట్విస్ట్ నెలకొంది.. అంతర్జాతీయ మార్క్ లో బంగారం రేటు చుక్కలనంటుకుంటుంది. కరోనా లాక్ డౌన్‌ ప్రభావం అన్ని వ్యాపారాలపై పడిన... బంగారం ధరలు మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకు పెరిగి కొండెక్కి కూర్చుంటున్నాయి. బులియన్ మార్కెట్లలో పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి.

 

అయితే ఇవాళ ఉదయం బంగారం ధరల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.  ఉదయం 10:20 గంటల ప్రాంతంలో దేశీయ మల్టీ కమోడిటీ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే రూ.495 పెరిగి 10 గ్రామలు పసిడి రూ.47,250 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ పసిడి ధర భారీగా పెరిగింది. వారం రోజుల కు ముందు బంగారం తగ్గుముఖం పట్టింది.. దాంతో పసిడి ఇక అందుబాటులోకి వస్తుందని భావించారు.. కానీ ఉన్నట్టుండి మళ్లీ రేటు భారీగా పుంజుకున్నాయి.

 

ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.45930కు చేరింది. ఇక 24 క్యారెట్స్ గోల్డ్ రూ. 49000 గాఉంది. అయితే వెండి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఇదిలా ఉంటే పసిడి ఫ్యూచర్స్‌ 1శాతం పెరగగా వెండి 3 శాతం పెరిగింది. మరో పక్క అంతర్జాతీయ మార్కెట్లోనూ పసిడి ధర పరుగులు పెడుతోంది. నిన్నటితో పోలిస్తే 19 డాలర్లు పెరిగి ఔన్స్‌ బంగారం 1,753.25 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: