బంగారం, వెండి ధరలు ఎంత దారుణంగా పెరిగిపోతున్నాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం అంటే కేవలం ఒక సంవత్సరంలో బంగారం ధరలు భారీగా అంటే భారీగా పెరిగాయి. ఇంకా ఈ కరోనా వేళా మరి దారుణంగా పెరిగిపోయాయి. కరోనా వైరస్ కారణంగా స్టాక్ మార్కెట్ లు దారుణంగా పడిపోయాయి. దీంతో ఇన్వెస్టార్లు అంత కూడా బంగారంపైనే ఇన్వెస్ట్ చేశారు.. ఇంకేముంది బంగారం ధర భారీగా పెరిగింది. 

 

ఇంకా అలాంటి బంగారం ధర ఈ నెలలో కాస్త అటు ఇటు ఉగుతుంది. గత వారంలో మూడు రోజుల పాటు భారీగా తగ్గినా బంగారం ధర ఇప్పుడు మళ్లీ తగ్గుముఖం పట్టింది. నిన్నటికి నిన్న భారీగా తగ్గింది. మళ్లీ ఈరోజు కూడా అదే పద్ధతి. అసలు ఈరోజు ఎంత తగ్గింది.. ప్రస్తుతం బంగారం ధర ఎంత నడుస్తుంది అనేది మనం ఇప్పుడు ఇక్కడ చూద్దాం. 

 

నేడు హైదరాబాద్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా కొనసాగుతున్నాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 120 రూపాయిల తగ్గుదలతో 49,100 రూపాయలకు చేరింది. అలానే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 130 రూపాయిల తగ్గుదలతో 45,300 రూపాయలకు చేరింది. 

 

ఇక దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.110 తగ్గింది. దీంతో ధర రూ.46,000కు క్షీణించింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.110 తగ్గింది. దీంతో ధర రూ.47,810కు దిగొచ్చింది. ఇక కేజీ వెండి ధర కూడా రూ.360 తగ్గింది. దీంతో ధర రూ.48,000కు చేరింది. 

 

ఇంకా వెండి ధర మాత్రం భారీగా పెరిగింది. కరోనా వచ్చిన ప్రారంభంలో కేవలం అంటే కేవలం 40 వేలు ఉన్న వెండి ధర ఇప్పుడు చిన్నగా 300 రూ, 500 రూ పెరుగుతూ వచ్చి ఇప్పుడు ఏకంగా 48,000 రూపాయలకు చేరింది. అయితే ఇదే నేపథ్యంలో ఈరోజు కూడా వెండి ధర భారీగా పెరిగింది. దీంతో కేజీ వెండి ధర 300 రూపాయిల పెరుగుదలతో 48,300కి చేరింది. మరి ఈ బంగారం, వెండి ధరలు ఎప్పుడు తగ్గుతాయి చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: