బంగారం ధర రోజుకో విధంగా మారుతుంది. అది నిజమే అనుకోండి.. అంతర్జాతీయ మార్కెట్ లో ఉన్న బంగారం ధర పై ఆధారపడి రేట్లు ఉన్నాయి. కరోనా వల్ల భారీగా పెరిగిన ఈ బంగారం రేట్లు ఇప్పుడు కూడా పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. వెండి విషయానికొస్తే.. బంగారం ధరల దారిలోనే పయనిస్తుంది. గత రెండు రోజుల క్రితం భారీగా తగ్గిన బంగారం ధర నిన్న దాదాపు 1000 రూపాయలు పెరిగింది. ఈరోజు కాస్త ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ రోజు కాస్త ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు. భారీగా బంగారం ధర తగ్గింది. మొత్తానికి ఇది పసిడి ప్రియులకు శుభవార్త అనే చెప్పాలి.



మరి హైదారాబాద్ మార్కెట్ లో బంగారం రేట్ల విషయానికి వస్తె..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.160 తగ్గుదలతో రూ.52,060 కు క్షీణించింది.. 22 క్యారెట్ల ధర చూస్తే..10 గ్రాములకు రూ.140 తగ్గింది. దీంతో ధర రూ.47,730కు తగ్గింది. బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం పైకి కదిలింది. కేజీ వెండి ధర రూ.300 పెరిగింది. దీంతో వెండి ధర రూ.62,400కు చేరింది. వెండి వస్తువులను డిమాండ్ పెరిగింది. బంగారం పెరగడం తో జనాలు వెండి వైపు మొగ్గు చూపుతున్నారు. 



వెండి వస్తువుల కొనుగోలు భారీగా పెరగడంతో ఈరోజు వెండి ధర కూడా పెరిగిందని తెలుస్తుంది.  అంతర్జాతీయ మార్కెట్ లో మాత్రం గోల్డ్ రేటు పూర్తిగా క్షీణించింది. ఔన్స్‌కు 0.07 శాతం తగ్గుదలతో 1877 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం పైకి పెరిగింది. వెండి ధర ఔన్స్ కు 0.02 పర్సెంట్ పెరగడంతో 23.35 డాలర్లకు పెరిగింది. విదేశీ మార్కెట్ ను బట్టి ఈ ధరలు పెరగడం జరుగుతుందని నిపుణులు అంటున్నారు.. రేపటి తగ్గుతుందా లేకా పెరుగుతుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: