గుడ్ న్యూస్.. బంగారం ధరలకు బ్రేకులు పడ్డాయి.. బంగారం ధరలు నెమ్మదిగా దిగి వస్తున్నాయి. బంగారం ధర బాటలో కాకుండా వెండి రేటు మాత్రం పైకి ఎగబాకుతోంది. మరోవైపు గ్లోబల్ మార్కట్ లో బంగారం, వెండి రేట్లు పెరుగుతున్నాయి. హైదరాబాద్ లో బంగారం ధరలు శనివారం కూడా నేల చూపులు చూస్తున్నాయి. ఇక ఆదివారానికి వస్తే ఈరోజు బంగారం ధరలు కిందకు దిగి వచ్చాయి. ధరల్లో స్వల్ప మార్పులు కనిపించాయి. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు పైకి కదిలాయి.. కానీ దేశీయ మార్కెట్ లో ధరలు తగ్గుముఖం పట్టాయి..


ఇక హైదరాబాద్ లో ఆదివారం ధరలను చూస్తే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 పడిపోయింది. దీంతో రేటు రూ.45,480కు తగ్గింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.10 తగ్గుదలతో రూ.41,690కు క్షీణించింది. బంగారం ధరలు తగ్గితే , వెండి ధరలు కూడా కిందకు దిగి వచ్చాయి.. బంగారం ధర తగ్గితే.. వెండి రేటు మాత్రం పైకి కదిలింది. వెండి ధర రూ.100 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.69,400కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.


అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు పెరిగాయి.పెరిగింది. బంగారం ధర ఔన్స్‌కు 0.36 శాతం పెరుగుదలతో 1735 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 0.25 శాతం పెరుగుదలతో 25.13 డాలర్లకు  చేరింది.. ఆదివారం కూడా దుకాణాల్లో కొనుగోళ్లు జరుగుతున్నాయి. అయితే, బంగారం ధరలు ఇలా పెరగడం, అదే విధంగా తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే..కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి తదితర అంశాలు ప్రభావాన్ని చూపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: