బంగారం కొనాలని భావించేవారు ఈరోజు కొనుక్కోవచ్చు.. ఎందుకంటే ఈరోజు మార్కెట్ లో బంగారం ధరల్లో ఎటువంటి మార్పు లేదని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. నిన్న కాస్త పెరిగిన ధరలు నేటి మార్కెట్లో మాత్రం నిలకడగా కొనసాగుతున్నాయి. భారత్ లో బంగారానికి ఉన్న డిమాండ్‌ దేనికి ఉండదు. అయితే.. కొన్ని రోజులుగా బంగారం ధరల్లో హెచ్చు, తగ్గులు కొనసాగుతూనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న పసిడి ధర.. తాజాగా స్థిరంగా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పైకి కదలడంతో... బులియన్ మార్కెట్‌లోనూ దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది.


 హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 46,090 కు చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 42,250 కు చేరింది. బంగారం ధరలు స్థిరంగా ఉండగా.. వెండి ధరలు మాత్రం భారీగా పడిపోయాయి. నిన్న కాస్త కిందకు దిగి వచ్చిన వెండి నేడు వెల వెల బోయింది. కిలో వెండి ధర రూ. 300మేర తగ్గి రూ. 69,700 వద్ద కొనసాగుతోంది.. పరిశ్రమలలో తయారు దారుల నుంచి డిమాండ్ తగ్గడంతో ఇప్పుడు తగ్గాయని అంటున్నారు.


ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు స్థిరంగానే ఉన్నాయని నిపుణుల అభిప్రాయ పడుతున్నారు. బంగారం ధర ఔన్స్‌కు 0.87 శాతం పెరుగుదలతో 1730 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 2.03 శాతం పెరుగుదలతో 25.03 డాలర్లకు చేరింది. బంగారం ధరల పై ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు లాంటి పలు అంశాలు బంగారం ధరల పై ప్రభావం చూపిస్తున్నాయి.. రేపు బంగారం ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: