దేశ వ్యాప్తంగా కరోనా కోరలు ఛాచుతుంది.. ఈ మేరకు గోల్డ్ కూడా మార్కెట్ లో పైకి కదిలింది. గత ఏడాది కరోనా సమయంలో కూడా ఇలానే బంగారం ధరలు ఒకేసారి ఆకాశానికి నిచ్చెనలు వేశాయి. కరోనా ప్రభావం కొంతవరకు తగ్గడంతో ధరలు కాస్త 50 కు చేరాయి. కాగా, ఈ ఏడాది ప్రారంభం నుంచి ఓ మాదిరిగా ఉన్న ధరలు పెరుగుతూ , తగ్గుతూ వస్తున్నాయి. నిన్నటి పోలిస్తే ఈరోజు రేట్లు భారీగా పెరిగాయి.బంగారం ధర పెరుగుతూనే వస్తోంది. ఈరోజు కూడా ఇదే ట్రెండ్ నడిచింది. బంగారం ధర పైపైకి చేరింది. పసిడి ప్రేమికులకు ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. బంగారం ధర పైకి చేరితే వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. 


అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు భారీగా పైకి కదిలాయి.హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర పైకి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.270 పెరుగుదలతో రూ.49,200కు ఎగసింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.250 పెరుగుదలతో రూ.45,100కు చేరింది. అదే ప్రొద్దుటూరులో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.49,700 వద్ద, 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,000 వద్ద కొనసాగుతుంది.


అయితే, బంగారం ధరలు పెరిగితే.. వెండి మాత్రం నిన్నటి రేటు తోనే కొనసాగుతుంది.వెండి ధర కేజీకి రూ.73,900 వద్దనే స్థిరంగా ఉంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ యదావిధిగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు.ఇక అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలను చూస్తే..బంగారం ధర ఔన్స్‌కు 0.27 శాతం పెరుగుదలతో 1786 డాలర్లకు చేరింది. బంగారం ధర పైకి కదిలితే వెండి రేటు మాత్రం దిగొచ్చింది. ఔన్స్‌కు 0.05 శాతం తగ్గుదలతో 26.17 డాలర్లకు క్షీణించింది.. నిన్న, ఈరోజు ధరలు పెరిగాయి.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: