బంగారం ధరలు భారీగా పెరిగాయి.. నిన్న కాస్త ఊరట కలిగించిన బంగారం ధరలు నేటి మార్కెట్ లో ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నాయి. కరోనా కేసులు ఇండియాలో లెక్కకు మించి నమోదు అవుతున్నాయి. దీంతో పుత్తడి రేట్లకు రెక్కలు వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌ లో బంగారం ధర పెరుగుదల నేపథ్యంలో దేశీ మార్కెట్‌లోనూ పసిడి పైకి కదిలిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.

హైదరాబాద్ మార్కెట్‌ లో మంగళ వారం బంగారం ధర పైకి కదిలింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.270 పెరిగింది. దీంతో రేటు రూ.49,260కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారి లో నడిచింది. రూ.240 పెరుగుదల తో రూ.45,150 కు చేరింది. రూ.800 పరుగులు పెట్టింది. దీంతో కేజీ వెండి ధర రూ.76,800 కు చేరింది. అంటే తులం వెండి ధర దాదాపు రూ.768 వద్ద ఉందని చెప్పుకోవచ్చు. వెండి రేటు 2 రోజుల్లోనే రూ.1500 పెరగడం గమనార్హం.


అంతర్జాతీయ మార్కెట్‌ లో కూడా బంగారం ధర పైకి ఎగసింది. బంగారం ధర ఔన్స్‌ కు 0.13 శాతం పెరిగింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌ కు 1870 డాలర్ల కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌ లో కూడా వెండి ధర పెరిగింది. పైపైకి కదిలింది. వెండి ధర ఔన్స్‌ కు 0.45 శాతం పెరుగుదల తో 28.40 డాలర్ల కు చేరింది. బంగారం ధర పై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు మొదలగు అంశాలు ప్రభావాన్ని చూపిస్తున్నాయి. మరి రేపు ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: