పసిడి ప్రియులకు భారీ షాక్.. గత కొన్ని రోజులుగా పుత్తడి ధరలు పరుగులు పెడుతున్నాయి. రష్యా, ఉక్రెయిన్ ల మధ్య జరిగిన భారీ యుద్ధం కారణంగా ప్రధాన వనరుల పై ధరలు భారీగా పెరిగాయి. అందులో భాగంగా పసిడి ధరలకు రెక్కలు వచ్చాయి.. నిన్న మార్కెట్ లో ధరలు స్థిరంగా ఉన్న ధరలు నేడు మార్కెట్ లో మాత్రం భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ లో కూడా ధరలు పైపైకి కదిలాయి. బంగారం ధరలు పెరిగితే, వెండి ధరలు కూడా అదే దారిలో నడిచాయి. ఆదివారం కూడా పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి..


మన దేశంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాము..ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,400 ఉండగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 52,800గా నమోదు అయ్యింది.ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ. 48,400 వుంది, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,800 కు చేరింది.ఇకపోతే చెన్నైలో మాత్రం బంగారం ధర కిందకు దిగి వస్తుంది. 22 క్యారెట్ల బంగారంపై రూ. 120 తగ్గి రూ. 48,940 కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌పై రూ. 130 తగ్గి రూ. 53,390 వద్ద నమోదు అయ్యింది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 48,400 ఉండగా , 24 క్యారెట్ల పసిడి ధర రూ. 52,800 వద్ద కొనసాగుతుంది..


హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం రూ. 48,400 వద్ద ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 52,800 వద్దకు చేరింది.విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధరలు రూ. 48,400 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,800 గా నమోదు అయ్యింది. విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ. 48,400 వద్ద చేరింది, 24 క్యారెట్ల బంగారం రూ. 52,800 గా మార్కెట్ లో నమోదు అవుతుంది.వెండిపై రూ. 500 పెరగగా, నేడు రూ. 100 పెరిగింది. దీంతో హైదరాబాద్, విజయవాడ నగరాల్లో కిలో గ్రాము వెండి ధర రూ. 74,700 కు చేరుకుంది..రేపు మార్కెట్ లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: