మధుమేహం ప్రపంచంలో ఎక్కువమంది ఎదుర్కుంటున్న అనారోగ్య సమస్య..మధుమేహం సోకితే అది శరీరంలో అనేకరకాలైన మార్పులకి గురించేస్తుంది. కిడ్నీల దగ్గరనుంచీ..కళ్ళ వరకు అనేకరకాలైన సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఒక్కకటిగా శరీరం అంతా ఈవ్యాధి కబలిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ వ్యాధి కళ్ళమీద తన ప్రభావాన్ని చూపిస్తుంది.దానినే డయాబెటిస్ రెటినోపతి.

 

 రెటినా కి రక్త సరఫరా చాలా వేగంగా జరగాలి..అలా జరిగినప్పుడు మాత్రమే..కళ్ళు పనిచేయడం జరుగుతుంది..మహుమేహం ఉన్న వాళ్లకి శరీరంలో రక్త సరఫరా అంత వేగంగా జరగదు. ఎందుకంటే రక్తంలో చెక్కెరల స్థాయి పెరిగిపోవడమే అందుకు కారణం.ఈ పరిస్థితిని డయాబెటిక్ రెటినోపతీ అంటారు. ఇది కంటికి వెనుక వైపు ఉండే తేలికపాటి కణజాలం, రక్త నాళాల నష్టం వలన కలుగుతుంది..ఈ సమయంలో మనం కంటిమీద జాగ్రత్తలు పాటించకపోతే ఈ ప్రభావం శాశ్వత కంటిచూపు నష్టాన్ని కలిగిస్తుంది.ఎంతోమంది కంటి చూపు ప్రభావానికి కారం డయాబెటిక్ రెటినోపతీనే.

 Image result for diabetes

కేనీసం సంవత్సరానికి ఒకసారి తప్పక ప్రతీ మధుమేహ వ్యాధి గ్రస్తులు పరీక్షలు చేయించుకోవాలి. రేటినోపతి ప్రారంభ దశలో తెలుసుకోవడం సులభం కాదు..అటువంటి పరీక్షలు లేవు..చివరికి చూపు మీద దుష్ప్రభావం పడేంత వరకు కూడా మనకి తెలియదు.అందుకే మధుమేహం ఉన్న వాళ్ళు షుగర్ లెవిల్స్ ని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకోవాలి..వైద్య పరీక్షలు చేయించుకోవాలి. సకాలంలో సూచించిన విధంగామందులను తీసుకోని మీ మధుమేహం నియంత్రించడం ద్వారా, కొంత బరువు కోల్పోవడం, మరియు డాక్టర్ తో మీరు గమనిస్తున్నా మార్పులను తెలియచేయటం ద్వారా  డయాబెటిక్ రెటినోపతీని మరింతసమర్థవంతంగా నిరోధించడానికి అవకాశం ఉంది.

 Image result for Diabetes affects eyes

మొదటి దశలో ఉన్న మైల్డ్ రెటినోపతిని రక్తంలో షుగర్ లెవిల్స్ ని కంట్రోల్ చేయడం ద్వారా నయం చేయవచ్చు అంతేకాదు ఒకవేళ అడ్వాన్స్ రేటినోపతి ఉన్నట్లయితే, లేజర్ శస్త్రచికిత్స అందించడంద్వారా కళ్ళుకు జరిగే మరింత నష్టాన్ని నిరోధించవచ్చు. ఎది ఏమైనా సరే మధుమేహం ఉన్న వాళ్ళు ఎప్పటికప్పుడు షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయలేక పొతే ఆ ప్రభావం ఇంకా తీవ్రతరం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: