పుచ్చకాయ నే కర్బూజా అని అంటారు.కర్బూజ వేసవికాలంలో దాహాన్ని తీరుస్తోంది. దీన్ని జ్యూస్ రూపంలో నైనా తీసుకోవచ్చు. కర్బూజ తియ్యగా రుచిగా ఉంటుంది. అంతేకాదు ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాం...

 రక్తపోటు ఉన్న వాళ్ళు కర్బూజ ని తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో పొటాషియం,మెగ్నీషియం అధికంగా ఉంటాయి. మూత్రపిండాల్లో, మూత్రనాళంలో ఇబ్బంది ఉన్న వాళ్లు కర్బూజా అను తీసుకోవడం చాలా మంచిది.పుచ్చకాయలో 92 శాతం ఆల్కలైన్ వాటర్ ఉంటుంది.ఈ నీరు శరీరానికి చాలా మంచిది.

 కర్బూజా లో ప్రోటీన్, ఫైబర్,  క్యాల్షియం, ఐరన్,పొటాషియం, సోడియం,విటమిన్ సి, విటమిన్ ఎ ఉన్నాయి.వల్ల అనేక రోగాలు దూరం అవుతాయి. ఆరోగ్య పరంగా కాకుండా, సౌందర్య సాధనంగా కూడా వాడతారు.

 కర్బూజ లో ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉంటాయి.ఇవి హానికర ఫ్రీరాడికల్స్ తో పోరాడుతాయి.వేసవికాలంలో ఎండా వేడి నుండి కమిలిపోకుండా కాపాడుతుంది.

కర్బూజాపండు లో బీ కాంప్లెక్స్ విటమిన్లు అధికంగా ఉంటాయి.కాబట్టి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.ఇంకా ఇన్ఫెక్షన్ రాకుండా అడ్డుకుంటుంది.

 కర్బూజాపండు లో నియాసిన్,పాంటో తోనిక్ ఆమ్లం,  విటమిన్ సి, మాంగనీస్ అధికంగా ఉంటాయి.ఇవి బీపీని కంట్రోల్ చేస్తాయి.

 కర్బూజా గుజ్జును ముఖానికి రాసుకుని పది నిమిషాల తర్వాత కడుక్కోవాలి. ముఖం కాంతివంతంగా ఉంటుంది.

 కర్బుజా జ్యూస్ తాగడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయి తగ్గి మధుమేహం ఉండి ఉపశమనం పొందవచ్చు.

కిడ్నీలో రాళ్లు ఉన్న వాళ్ళు కర్బూజ తినడం వల్ల కరిగిపోతాయని నిపుణులు సూచిస్తున్నారు. అజీర్తి, యూరిన్ సమస్యలు తగ్గుతాయి.

 కర్బూజా ను నిత్యం తీసుకోవడం వల్ల నరాలు,
కండరాలు ఉత్తేజంగా ఉంటాయి.నిద్రలేమితో బాధపడేవారు ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల నిద్ర సక్రమంగా పడుతుంది.

                                                                                                                                                                                                                                       

మరింత సమాచారం తెలుసుకోండి: