ఇండియా హెరాల్డ్ గ్రూప్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి....కొత్తిమీర ఎంత రుచికరమైన పదార్ధమో వేరే చెప్పాల్సిన పని లేదు. మనం చేసుకునే కూరలలో కొత్తిమీర కలిపితే ఆ రుచి వర్ణనాతీతం. కూరకి అంత రుచి వస్తుంది కొత్తిమీరతో. ఇక కొత్తి మీర కేవలం రుచికే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కొత్తిమీర మంచి కొలెస్ట్రాల్ లెవెల్స్ ని పెంచి చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గిస్తుంది.ఇక కొత్తిమీర ఆకులు వికారానికీ, అజీర్ణ సమస్యలకీ మంచి విరుగుడు. ఇది తీసుకోవడం వల్ల పొట్టలో అరగడానికి హెల్ప్ చేసే డైజెస్టివ్ జ్యూసులు ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి.


వీటిలో ఫైబర్ కూడా ఎక్కువగానే ఉంటుంది.కొత్తిమీర కి ఉన్న హెల్త్ బెనిఫిట్స్ లో ఒకటి షార్ప్ ఐ సైట్. కొత్తిమీర లో ఉండే విటమిన్ ఏ, విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్స్, ఫాస్ఫరస్ విజన్ డిసార్డర్స్ ని ప్రివెంట్ చేస్తాయి. కంటి మీద ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇందులో ఉండే బీటా కెరొటిన్ వల్ల వయసు పెరగడం వల్ల వచ్చే డీజెనరేటివ్ ఎఫెక్ట్స్ ని కొత్తిమీర రివర్స్ చేయగలదు. కండ్ల కలక రాకుండా ప్రివెంట్ చేస్తుంది.హైబీపీ తో బాధ పడుతున్న వారికి కొత్తిమీర సలాడ్ తీసుకోమని డాక్టర్లు సూచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది హార్ట్ ఎటాక్స్, స్ట్రోక్ వంటివి వచ్చే రిస్క్ ని బాగా రెడ్యూస్ చేస్తుంది.



కొత్తిమీర లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ ని స్ట్రాంగ్ గా చేస్తాయి. న్యూరో డీజెనరేటివ్ డిసీజెస్ ని ప్రివెంట్ చేస్తాయి. రెగ్యులర్ గా కొత్తిమీర తీసుకోవడం వల్ల కాన్సర్, అల్జైమర్స్, డయాబెటీస్ వంటి వ్యాధులు వచ్చే రిస్క్ బాగా రెడ్యూస్ అవుతుంది.టూత్‌పేస్ట్ కనుక్కోక ముందు ప్రజలు నోటి దుర్వాసన పోగొట్టుకోవడానికి ధనియాలు నమిలేవారని మీకు తెలుసా? యాంటీ సెప్టిక్ టూత్ పేస్ట్స్ లో తప్పని సరిగా కొత్తిమీర ఉంటుంది. అలాగే, కొత్తిమీర నోటి పుళ్ళని కూడా పోగొడుతుంది.


ఆస్తియోపొరాసిస్ వంటి వ్యాధులతో బాధపడుతున్న వారిని కొత్తిమీర తీసుకోమని చెబుతారు. ఎముకలు బలంగా, ఆరోగ్యం గా ఉండాలని కోరుకునే వారందరూ కొత్తిమీరని వారి రోజువారీ ఆహారంలో తప్పని సరిగా భాగం చేసుకోవాలి. ఇందులో ఉండే కాల్షియం, ఇంకా ఇతర మినరల్స్, బోన్ డిగ్రడేషన్ ని ప్రివెంట్ చేస్తాయి, బోన్ రీగ్రోత్ కి హెల్ప్ చేస్తాయి.ఇక ఇలాంటి మరెన్నో ఆరోగ్య చిట్కాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆరోగ్య విషయాలు గురించి తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి: