పనిభారం వల్ల ఒత్తిడి ఎక్కువగా కలుగుతూ ఉంటుంది.  ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఒత్తిడి వస్తుంది. ఈ విధంగా  అనేక కారణాల వల్ల ఒత్తిడితో చాలామంది బాధపడుతుంటారు.  ఇలాంటి సమయంలో కొన్ని చిట్కాలు పాటించడం వల్ల ఒత్తిడిని జయించే వచ్చు. ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...                                           

 తీవ్రమైన ఒత్తిడి లేదా ప్రతికూలత సమయాల్లో మీ కోపాన్ని అధిగమించడానికి మరియు మీ శక్తి సానుకూల  కార్యాచరణ కోసం మీరు ఎప్పుడూ ఏదో ఒక పని మీద బిజీగా ఉండటం మంచిది.

 తీవ్రమైన ఒత్తిడితో ఉన్నప్పుడు వ్యాయామం చేయడం వల్ల ఎండోర్పిన్ లు అని పిలువబడే హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి మన స్థితిని మెరుగు పరిచే ఆరోగ్యకరమైన హార్మోన్లు. వీటికోసం రోజూ 20 నిమిషాలు జాగింగ్,  లేదా వాకింగ్ లేదా వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది.

 ఒత్తిడిలో ఉన్నప్పుడు మంచి సంగీతం వినడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండటమే కాకుండా, గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాకుండా ఒత్తిడిని పెంచే హార్మోన్ స్థాయిలు తగ్గుతాయి.

 మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీకు ఇష్టమైన పుస్తకాలు చదవడం మంచిది. దీంతోపాటు వెచ్చగా ఒక కాఫీ తాగడం మరింత మజాగా ఉంటుంది.

 మంచి దుస్తులు వేసుకోవడం వల్ల మనకు సానుకూల ఆలోచనలు కలుగుతాయి. అంతేకాకుండా ఒత్తిడి కూడా దూరం అవుతుంది.


 ఒత్తిడిని తగ్గించుకోవడానికి మన అభిరుచులు కూడా సహాయపడతాయి. మనకు బాగా ఇష్టమైన పనిలో నిమగ్నం అవ్వడం వల్ల మానసికంగా బాగుంటారు. అలాగే తనకు ఇష్టమైన ప్రదేశాలకు వెళ్లడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.

 దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల ఆందోళన, నిద్రలేమి, కండరాల నొప్పి, మరియు అధిక రక్తపోటు వంటి సమస్యలు వస్తుంటాయి. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నప్పుడు సాధ్యమైనంతవరకు వైద్యుని సంప్రదించాలి

మరింత సమాచారం తెలుసుకోండి: