ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది చనిపోతున్న కారణాల్లో మొదటి స్థానంలో ఇప్పుడు
కరోనా ఉంటే దాని తరువాత
కాన్సర్ రెండవ స్థానంలో ఉంది.ఇక రెండు సంవత్సరాల క్రితం అంటే 2018లో చూసుకున్నట్లయితే
కాన్సర్ వల్ల సుమారు 9.6 మిలియన్ల ప్రజలు చనిపోయారు. ఈ 9.6 మిలియన్ల మరణాల్లో కేవలం కోలన్ (కొలొరెక్టల్)
కాన్సర్ వల్ల 1.80 మిలియన్ల మంది చనిపోయారు. ఇక ఈ కొలొరెక్టల్
కాన్సర్ జనాలకు చాలా కామన్ గా వచ్చే కాన్సర్.కోలన్
కాన్సర్ అంటే పెద్ద ప్రేగు
కాన్సర్, ఇది రెక్టం, అంటే పురీష నాళం వద్ద మొదలవుతుంది. ఈ రెండు అవయవాలూ కూడా డైజెస్టివ్ సిస్టమ్‌లో కింద భాగంలో ఉంటాయి.అలాగే కోలన్ చివరి భాగంలో రెక్టం ఉంటుంది. మాములుగా కొలొరెక్టల్
కాన్సర్ డెబ్భై ఏళ్ళు అంత కంటే ఎక్కువ వయసు ఉన్న వారిని ఎఫెక్ట్ చేస్తుంది. అలాగని ఇది మిగిలిన వయసుల వారికి రాదని నమ్మకంగా చెప్పలేం. ఏ వయసులో వారికైనా కొలొరెక్టల్
కాన్సర్ వచ్చే ప్రమాదం వుంది.
ఇక జనాలకు ఎక్కువగా వచ్చే కాన్సర్లలో ఈ
కాన్సర్ మూడవది, అలాగే మరణాలకి కారణమయ్యే కాన్సర్లలో ఇది నాలుగవది.కాబట్టి ఈ
కాన్సర్ గురించి అవగాహన కలిగి ఉండడం ఎంతో అవసరం. ఎందుకంటే, కొలొరెక్టల్
కాన్సర్ మొదటి స్టేజిలో ఉన్నప్పుడు ఎటువంటి లక్షణాలూ కనబడవు. అయితే, క్రానిక్ గా ఉన్న కాన్స్టిపేషన్ ఇంకా డయేరియా అలాగే మలం రంగు మారడం, మలంలో రక్తం పడడం అలాగే రెక్టం నుండి బ్లీడింగ్ ఉండడం, ఇంకా బాగా గ్యాస్ ఉండడం, విపరీతంగా కడుపులో నొప్పి వంటివన్నీ ఈ కాన్సర్‌కి సూచనలు..
ఇక బీఫ్, పోర్క్, లాంబ్, లివర్ వంటి
రెడ్ మీట్ ఎక్కువగా తినడం వల్ల ఈ
కాన్సర్ వచ్చే రిస్క్ వుంది.ఇది ఒక్కసారి వచ్చిందంటే తగ్గడం కష్టం. అందుకే ఎక్కువగా పండ్లు, కూరగాయలు, హోల్ గ్రెయిన్స్ తో కూడిన ఆహారం తీసుకుంటూ శారీరకంగా చురుగా ఉండడం వల్ల ఈ కోలన్
కాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది