సౌత్ ఆఫ్రికా తాజాగా వెల్లడించిన నివేదిక ప్రపంచాన్ని ఉలిక్కిపడేట్టు చేసింది. రష్యా తయారు చేసి ప్రపంచానికి పంపిణి చేసిన స్పుత్నిక్ టీకా తో కొత్త సమస్యలు వస్తున్నాయని, ముఖ్యంగా పురుషులకు ఈ టీకా వేసుకుంటే ఎయిడ్స్ సోకె ప్రమాదం ఎక్కువగా ఉందని స్పష్టం చేసింది. దీనితో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఈ టీకాపై అయోమయం నెలకొంది. ఇప్పటికే దీనిని వాడిన వాళ్ళు తమకు ఏమి అవుతుందో అంటూ ఆందోళన పడుతున్నారు. నిజానికి రష్యా ఈ టీకాను తయారు చేయడానికి వాడిన ముడిపదార్దాలలో ఎయిడ్స్ సంక్రమింపజేసే అడినో వైరస్ టైప్ 5 ఉందని, దానితో ఎప్పటికైనా సమస్యే అని సౌత్ ఆఫ్రికా ఔషధ నియంత్రణ సంస్థ పేర్కొంది. దీనికి సంబందించిన మరింత సమాచారం రష్యా ఇస్తేనే దానిని క్షుణ్ణంగా పరిశీలించి, అత్యవసరానికి అనుమతులు ఇస్తామని వారు అన్నారు.

అయితే ఇప్పటికే దీనిని వాడుతున్న నమీబియా లాంటి దేశాలు సౌత్ ఆఫ్రికా ప్రకటన వినగానే అద్దంతరంగా స్పుత్నిక్ టీకాను ఇవ్వడం ఆపివేసింది. మరో ప్రకటన వచ్చిన అనంతరం మళ్ళీ టీకా ఇచ్చేది లేనిది నిర్ణయం తీసుకుంటామని ఆ దేశం ప్రకటించింది. భారత్ లో కూడా ఈ టీకాలు ఉత్పత్తి అయినప్పటికీ, అత్యవసర అనుమతి లభించకపోవడంతో ఆయా దేశాలకు ఎగుమతి ఆగిపోయింది. అయితే ఉత్పత్తి వృధా కాకుండా రష్యా లో కరోనా వైరస్ అధికంగా ఉన్నందున అక్కడకు పంపించే ప్రయత్నాలు జరిగాయి. భారత్ లో స్పుత్నిక్ లైట్ కూడా పిల్లల కోసం ప్రయోగ స్థాయిలో ఉన్నది. అది కూడా రేపోమాపో అనుమతి పొందాల్సి ఉంది.  

కానీ ఇప్పటికే దానిపై అపోహలు ఉండటంతో దానిని వాడేది లేనిది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇదంతా వదంతులేనా లేక నిజంగా సత్యమా అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేడు ప్రపంచంలో చాపకింద నీరులా వాణిజ్య యుద్ధం జరుగుతుంది. దానివలన ఆయా దేశాలలో ఉత్పత్తి అయినా టీకాలను తక్కువకు లభిస్తాయని ఉద్దేశ్యంతో లేదా అసలు ఉచితంగాను లభిస్తాయని ఉద్దేశ్యం చేత లేదా ఉత్పత్తి దారుల పెట్టుబడులు నష్టపరిచేందుకు కూడా ఇలాంటి వదంతులు పుట్టించేంత నీచ స్థాయికి కొన్ని దేశాలు దిగజారిపోయినందున, వార్తలను సదరు నిపుణుల చేత విశ్లేషించి అనంతరం దానిపై నిర్ణయానికి రావాల్సిన అవసరం పాఠకులకు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: