
ఆవాలలో గ్లూకోసినోలైట్స్ అనే ముఖ్యమైన ఫైటో కెమికల్ ఉంటుంది కాబట్టి ఇది శరీరంలో ఫ్రీరాడికల్స్ తో పోరాడి క్యాన్సర్ ను నిరోధించడంలో సహాయ పడుతుంది అని అధ్యయనాలు చెబుతున్నాయి. గర్భం, మూత్రాశయం మరియు ప్రేగులకు సంబంధించిన క్యాన్సర్ల నిరోధించడంలో పసుపు ఆవాలు సమర్థవంతంగా పనిచేస్తాయి. మీ ఆహారంలో ప్రతిరోజు పసుపు ఆవాల నుంచి తీసిన నూనె లేదా ఆవాల పొడిని చేర్చుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి.
ఇందులో ఉండే మెగ్నీషియం కారణంగా జీవక్రియ రేటును పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి పసుపు ఆవాలు. ప్రొటీన్లు , కార్బోహైడ్రేట్లు ఉండడంవల్ల శరీరానికి మంచి శక్తి కూడా లభిస్తుంది.నోటి నుంచి వచ్చే దుర్వాసన నియంత్రించడానికి కూడా ఒక అద్భుతమైన హోం రెమడీ అని చెప్పవచ్చు. మీ నోటిలోకి పసుపు ఆవాల తో తీసిన నూనె వేసి ఒక నిమిషం పాటు ఉంచి.. బయటకి మూయాలి.. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే నోటి దుర్వాసన కూడా దూరం చేసుకోవచ్చు. ఇక గుండె సంబంధిత రోగాలు, నరం పట్టేయడం, జుట్టు సమస్యలు ఇలా అన్నింటిని దూరం చేయడంలో పసుపు ఆవాలు బాగా పనిచేస్తాయి.