ఈ వేసవి కాలంలో ప్రతి ఒక్కరు చల్లదనం కోసం పలు కూల్ డ్రింక్స్, నిమ్మకాయ రసం వంటివి ఎక్కువగా తాగుతూ ఉంటారు. అలాగే నీరు ఎక్కువగా ఉండడం వల్ల పండ్లు కూరగాయలను కూడా తింటూ ఉంటారు. ఇక ఈ వేసవి కాలంలో ఎక్కువగా పెరుగు, మజ్జిగ తీసుకోవడం చాలా మందికి అలవాటు గానే ఉంటుంది. పెరుగు నుంచి మజ్జిగ చేసుకుని నిత్యం తీసుకుంటూ ఉంటారు ఇందులో అనేక పోషకాలు. ముఖ్యంగా పాస్పరస్, విటమిన్-B12, మినరల్స్, క్యాల్షియం వంటివి ఉంటాయి.

ఇవన్నీ ఉండడంచేత మజ్జిగ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇక అంతే కాకుండా మజ్జిగలో ప్రోబయోటిక్ లాక్టిక్ యాసిడ్ అనేది ఉంటుంది. దీనివల్ల జీర్ణవ్యవస్థ చాలా మెరుగుపడుతుంది. ఇక అంతే కాకుండా చర్మ సమస్యలను కూడా తగ్గించడంతో చాలా సహాయపడుతుంది. ముఖ్యంగా ముఖం మీద ఉండే ముడతలను కూడా తగ్గిస్తూ ఉంటుంది. అయితే ఇన్ని ప్రయోజనాలు ఉన్న మజ్జిగను కొంతమంది మాత్రం అసలు తాగ కూడదు వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

జలుబు, దగ్గు, గొంతు నొప్పి సమస్యతో బాధపడేవారు ఈ మజ్జిగ ని అసలు తాగకూడదు ఇలాంటి సమయంలో మజ్జిగ తాగితే ఆరోగ్యం మరింత పాడౌవుతుందట  అందుచేత నే రాత్రి సమయాలలో మజ్జిగను తీసుకోవడం మానుకోవాలి. ఇక మూత్రపిండాలు, తామర, కిడ్నీ సమస్యతో బాధపడేవారు మజ్జిగను అస్సలు తీసుకోకూడదు. కీళ్ల నొప్పులు ఎముకలకు సంబంధించిన సమస్యలతో బాధపడేవారు మజ్జిగను తీసుకోకపోవడం చాలా మంచిది. ఒకవేళ మీరు మజ్జిగతో తీసుకుంటే కీళ్లలో దృఢత్వం ఏర్పడుతుంది.


ఇక అంతే కాకుండా గుండె జబ్బులు ఉండేవారు ఈ మజ్జిగ తాగితే అందులో ఉండే కొలెస్ట్రాల్ గుండెకు చేరుతుందట. అందుచేతనే అధిక కొలెస్ట్రాల్ ఉన్న వ్యక్తులు ఈ మజ్జిగను తాగకపోవడం మంచిది. ఇక జ్వరం వచ్చిన వ్యక్తులకు కూడా ఈ మజ్జిగ తాగకూడదు ఎందుకంటే అందులో కూలింగ్ ఎఫెక్ట్  ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: