చిన్నప్పుడు స్కూల్ రోజుల్లో విద్యార్దులు ఏమయినా తప్పు చేస్తే వారితో గోడ కుర్చీ వేయించేవారు టీచర్లు. అప్పట్లో పాఠశాలలో పిల్లలు తప్పు చేస్తే టీచర్లు ఇచ్చే పనిష్మెంట్ లలో ఇదే హైలెట్. ఈ అనుభవం దాదాపు అందరికీ ఎదురయ్యే ఉంటుంది, ఆ రోజుల్లో ఇది చాలా కామన్ అవో... తీపి జ్ఞాపకాలు. అయితే రాను రాను కాలం ఎంతగానో మారింది. ఇవన్నీ కనుమరుగు అయిపోయాయి. ఇప్పట్లో స్కూల్స్ లో పనిష్మెంట్ అనే పదం కూడా క్రైమ్ అన్నట్లుగా ఉన్నాయి పరిస్థితులు. ఇవన్నీ పక్కన పెడితే గోడ కుర్చీ అనేది అప్పట్లో ఒక పనిష్మెంట్.. కానీ ఇపుడు ఇది అద్భుతమైన ఆసనం. మన ఆరోగ్యాన్ని సంరక్షించే ఒక మంచి చిట్కా.

పెద్దయ్యాక ఎవరూ గోడ కుర్చీలు వేయాలి అంటే దాదాపు అసాధ్యం నామోషీగా ఫీల్ అవుతారు.. అయితే ఇపుడు గోడ కుర్చీ వేయడం శిక్ష కాదు ఆరోగ్యానికి రక్ష అంటున్నారు. మానసిక, శారీరక ఆరోగ్యానికి గోడకుర్చీ చాలా అవసరమని చెబుతున్నారు వైద్యులు. అత్యుత్తమ వ్యాయామాలలో గోడ కుర్చీ కూడా ఒకటి అని చెబుతున్నారు. కనీసం రోజుకు అయిదు నిమిషాలు కనుక గోడ కుర్చీ వేస్తే చాలు ఎన్నో ప్రయోజనాలు ఆరోగ్యం సేఫ్ అంటున్నారు. గోడకు ఆనుకుని కూర్చునే గోడ కుర్చీలో ఓర్పును పెంచే గుణం ఉంటుందట.  రోజుకు అయిదు నిమిషాలు గోడ కుర్చీ పొజిషన్ లో కూర్చుంటే మానసిక శక్తి అభివృద్ధి చెందుతుంది అని దైర్యం పెరుగుతుందట.

ఒత్తిడి తగ్గి ప్రశాంతత వస్తుందట. ఫోకస్ పెరిగి పెట్టి ఆలోచించన శక్తి కూడా బాగా పెరుగుతుందట. బిపి ఉన్న వారు కూడా రోజు ఇలా గోడ కుర్చీ వేయడం చాలా మంచిది అని అంటున్నారు వైద్య నిపుణులు.  అంతేకాదు ఇదో మంచి ఎక్సర్సైజ్, శరీర బరువు కూడా బాగా తగ్గించుకోవచ్చు.  మొదట్లో కాస్త కష్టంగా అనిపించిన ఆ తరవాత బాగా అలవాటు అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: