కొన్ని కారణాల చేత కొంతమందికి ఎక్కువగా కళ్ళు తిరగడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా బీపీ తక్కువ అయిన ఒత్తిడి ఎక్కువ అయినప్పుడు ఇలాంటి వి జరుగుతూ ఉంటాయట.అయితే కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల కూడా ఇలా కళ్ళు తిరుగుతాయని కొంతమంది వైద్యులు తెలియజేస్తున్నారు. వాటికి సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.


1). మైగ్రీన్ సమస్య మనం మాటల్లో చెప్పలేనిది ఈ నొప్పి ఒక్కసారి వచ్చిందంటే దాదాపుగా కొన్ని రోజుల పాటు ఉంటుంది.ఈ సమస్య వచ్చినప్పుడు తలనొప్పి మాత్రమే కాకుండా వాంతులు, వికారం వంటి సమస్య లు వస్తాయట. వీటితోపాటుగా కళ్ళు తిరగడం వంటివి కూడా జరుగుతాయి.


2). మన శరీరంలో రక్తం తక్కువ అయినప్పుడు కూడా కళ్ళు తిరుగుతూ ఉంటాయి. దీనిని రక్తహీనత అని అంటారు. దీనివల్ల ఆక్సిజన్ సరిగ్గా మెదడుకు అందక పోవడం వల్ల ఇలా కళ్ళు తిరుగుతాయట.


3). రక్తంలో చక్కెర స్థాయి విలువలు ఎక్కువగా ఉంటే వాటిని మధుమేహంగా గుర్తిస్తాము. అయితే కొంతమంది బ్లడ్ షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా తగ్గిపోతాయి ఇలా రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిపోవడం వల్ల కూడా ఈ సమస్య ఎదురవుతుందట. అంతేకాకుండా హార్మోన్ల అసమతుల్యంగా ఉన్నా కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయని వైద్యులు తెలియజేస్తున్నారు.


4). ఒత్తిడి ఎక్కువగా ఎదురైనప్పుడు ఇలా కళ్ళు తిరుగుతూ ఉంటాయి దీని వల్ల గుండెకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా అయితాయని వైద్యులు తెలుపుతున్నారు.

5). మన శరీరంలో ఉప్పు పదార్థం తగ్గినప్పుడు కళ్ళు తిరుగుతూ ఉంటాయి. దీనిని బిపి అని అంటూ ఉంటారు. దీని వల్ల కూడా ఒక్కొక్కసారి కళ్ళు తిరుగుతాయని వైద్యులు తెలియజేస్తున్నారు. ఇలా తక్కువ అయినప్పుడు ఒకసారిగా కింద పడడం తల తిరగడం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి

అందుచేతనే ప్రతి ఒక్కరు కూడా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం సరైన ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: