ఈ రోజుల్లో మారిపోతున్న లైఫ్ స్టైల్  కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా శరీరంలో రకరకాల నొప్పిలు, వాపులు తలెత్తుతుంటాయి. అలాంటి వాటిని నిర్లక్ష్యం చేయకుండా ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.ఇక చాలా మందికి రాత్రి పడుకునే ముందు పాదాలలో నొప్పిగా ఉంటుంది. పాదాలలో నొప్పి అనేది ఈ రోజుల్లో సాధారణమైన సమస్య అయినా.. నిర్లక్ష్యం చేస్తే మరింతగా ఇబ్బందులు పడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి నొప్పి, వాపుల నుంచి ఉపశమనం కలగాలంటే కొన్ని హెల్తీ టిప్స్  అనేవి పాటించాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.మస్టర్డ్ ఆయిల్ పాదాల నొప్పిని తగ్గించడంలో చాలా సహాయపడుతుంది. రాత్రిపూట ఆవాల నూనెను వేడి చేసి పాదాలను బాగా మసాజ్ చేయండి. ఇది మీకు నొప్పి నుండి చాలా ఉపశమనం ఇస్తుంది.మెంతులు యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ప్లిమెటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. దీని కారణంగా ఇది మంచి నొప్పి నివారిణిగా పనిచేస్తుంది. మీరు చేయాల్సిందల్లా ఒక చెంచా మెంతులను నానబెట్టి రాత్రంతా ఉంచాలి. ఉదయాన్నే లేచి ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగాలి.


మీరు రోజుకు ఒకటి లేదా రెండుసార్లు ఒక చెంచా మెంతి గింజలను కూడా నమలవచ్చు. ఇలా చేయడం వల్ల పాదాల నొప్పులను కూడా దూరం చేసుకోవచ్చు.ఆపిల్ సైడర్ వెనిగర్ పాదాల నొప్పిని తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో అనాల్జేసిక్ గుణాలు ఉన్నాయి. ఇది పాదాలలో వాపు, నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు ఒక కప్పులో రెండు టీస్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్, అర టీస్పూన్ తేనె కలిపి ఖాళీ కడుపుతో తాగవచ్చు. ఇలా చేయడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.ఇంకా అలాగే రోజూ యోగా చేయడం ద్వారా మీరు పాదాల నొప్పి నుండి చాలా ఉపశమనం పొందుతారు. యోగా చేయడం వల్ల మన శరీరంలో రక్తప్రసరణ బాగా జరిగి శరీరం యాక్టివ్‌గా మారుతుంది. మీ పాదాలలో లేదా మీ శరీరంలో ఎక్కడైనా నొప్పి ఉంటే యోగాను మీ దినచర్యలో భాగంగా చేసుకోండి. మీరు కాలు తిమ్మిరిని తగ్గించడానికి బౌండ్ యాంగిల్, డాల్ఫిన్, ఈగిల్ లేదా ఎక్స్‌టెండెడ్ సైడ్ యాంగిల్ అన్ని చేయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: