ఇప్పుడున్న ఆహార అలవాట్లు వల్ల రోజూ రోజుకి అందం, ఆరోగ్యం రెండూ చెడిపోతున్నాయి. మన జీవన విధానం, ఆహార అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల అందం ఆరోగ్యం రెండు మన సొంతం చేసుకోవచ్చు. వాటి కోసం మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఇందులో ముఖ్యంగా రాగి పిండితో తయారు చేయబడిన ఆహార పదార్థాలు మన అందానికి ఆరోగ్యానికి రెండిటికీ ఉపయోగపడతాయి.అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

1).రాగి పిండిలో మన శరీరానికి కావాల్సిన యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల, పోషకాహార లోపం, ప్రాణాంతకమైన రోగాలు  మరియు వృద్ధాప్య ఛాయలు అంత తొందరగా దరిచేరవు.

2).ఇందులో అమినోయాసిడ్స్, ట్రిప్టోఫాన్ అనే అమినోఆమ్లం ఉండటం వల్ల రాగి పిండితో తయారు చేసిన ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల అతిఆకలిని తగ్గిస్తుంది. మరియు బరువు పెరగకుండా నియంత్రిస్తుంది.

3).రాగి జావ‌ను తీసుకోవడం శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అలాగే రాగుల్లో ఉండే ప్రోటీన్లు, ఎ, బి, సి విటమిన్లు, మినరల్స్ ఆరోగ్యానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి.దీంతో జీర్ణశక్తి మెరుగుపడుతుంది.

4).రాగి లో ఉన్న కాల్షియం ఎముకలు మరియు దంతాల పట్టుత్వానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనితో తయారుచేసే ఆహారాలు పిల్లలకు తర్చుగా ఇవ్వడం వల్ల వారికి ఎదుగుదల లోపాలు లేకుండా కాపాడుతుంది.రాగుల్లో ఉండే పాలిఫినాల్స్, డైటరీ ఫైబర్ డయాబెటిస్ కంట్రోల్ లో ఉంచుతాయి.

5).రాగుల్లో అమైనో యాసిడ్ లెసిథిన్ మరియు మేథినోన్ అనే ఆమైనోఆసిడ్స్ కలిగి ఉండడం వల్ల  కాలేయంలోని చెడు కొలెస్ట్రాలను తొలగించడం ద్వారా అధికంగా ఉన్న కొలెస్ట్రాలను కరిగిస్తుంది.వీటితోపాటు అధిక ఫైబర్ ఉండడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

6).రాగులతో తయారు చేసే మొలకలను ఆహారంలో  చేర్చుకోవడం వల్ల వృద్ధాప్య ఛాయలు త్వరగా రావు. చర్మం కూడా అందంగా,మృదువుగా తయారవుతుంది. రాగుల్లో ఐరన్ అధికంగా లభిస్తుంది. అందువల్ల ఇది  రక్తహీనత సమస్య తో బాధపడేవారికి చాలా బాగా ఉపయోగపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: