మన వంటింట్లో లభించే ఉల్లిపాయల్లో చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ఉల్లిపాయ చాలా రకాల వ్యాధులను నయం చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది. అందుకే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని పెద్దలు అంటారు.. అయితే, ఉల్లిపాయ రసంలో ఉండే గుణాలు బరువు తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయి.ఇక ఉల్లిపాయ రసంలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు ఇంకా అలాగే చాలా రకాల ఖనిజాలు దాగున్నాయి. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్ శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా బరువును చాలా ఈజీగా తగ్గిస్తుంది. ఇంకా అలాగే ఉల్లిపాయలు తీసుకోవడం ద్వారా స్థూలకాయం సమస్య కూడా చాలా ఈజీగా తొలగిపోతుంది. బరువు తగ్గడానికి మనం ఉల్లిపాయలను చాలా రకాలుగా తీసుకోవచ్చు.ఇక బరువు తగ్గడానికి ఉల్లిపాయను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.చాలా మంది కూడా సలాడ్‌లో ఉల్లిపాయలను ఉపయోగిస్తారు.


ప్రతి రోజూ ఉల్లిపాయలు తింటే.. బరువు చాలా సులభంగా తగ్గవచ్చు.. పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల కూడా బరువు చాలా ఈజీగా తగ్గుతారు. మీరు ప్రతిరోజూ మీ ఆహారంతో పాటు ఉల్లిపాయను సలాడ్‌గా కనుక తింటే.. ఇది బరువు తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది.ఉల్లిపాయను తీసుకొని దానిని ముక్కలుగా కట్ చేసి, ఆపై నీటిలో వేసి ఉడకబెట్టండి.తరువాత వాటిని బాగా మరగనివ్వాలి.కావాలనుకుంటే ఈ సూప్‌లో మీరు కొన్ని ఇతర కూరగాయలను కూడా జోడించవచ్చు.ఇక ఈ సూప్‌ని బాగా ఉడకబెట్టి దానికి నల్ల ఉప్పు వేసి కలుపుకొని తాగాలి. ఇంకా అలాగే మీరు ఇందులో నిమ్మరసం కూడా జోడించవచ్చు. ఈ రెసిపీ బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడుతుంది.ఉల్లిపాయ రసం మన బరువుని తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మీరు బరువు తగ్గడానికి ఇతర జ్యూస్‌ల లాగానే ఉల్లిపాయ రసాన్ని కూడా తాగవచ్చు.ఉల్లిపాయను మిక్సీలో గ్రైండ్ చేసి జ్యూస్‌గా చేసి అందులో ఉప్పు ఇంకా నిమ్మరసం కలిపి తాగాలి. ఇలా రోజు చేస్తే కొవ్వు చాలా వేగంగా కరిగిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: