ఉల్లిపాయే కాదు.ఉల్లికాడ కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో పీచు పదార్ధం ఎక్కువ. దీనిని తరచుగా తినేవారిలో బరువు సమస్య ఏర్పడదు. అలాగే మలబద్ధక సమస్య కూడా ఉండదు. ఉల్లి కాడల్లో ఉన్న డైటరీ ఫైబర్ ఆకలిని ఈజీగా అదుపులో ఉంచుతుంది.అలాగే ఫైల్స్ సమస్యతో ఇబ్బందిపడేవారు ఒక చిన్న బౌల్‌లో కొద్దిగా పెరుగుని వేసుకుని అందులో ఉల్లికాడ ముక్కలను కలిపి.. రోజుకి రెండుసార్లు తింటే పైల్స్ సమస్య చాలా ఈజీగా తగ్గుతుంది. పైల్స్ వల్ల వచ్చే వాపులు ఇంకా నొప్పి కూడా తగ్గుతాయి.అలాగే ఉల్లికాడల్లో సల్ఫర్ అధికంగా ఉంటుంది. దీన్ని తరచుగా తినే ఆహారంలో చేర్చుకుంటే కొలెస్ట్రాల్‌ను, హైబీపీని అదుపులో ఉంటాయి.అలాగే జలుబు, దగ్గుతో ఇబ్బంది పడేవారికి ఉల్లికాడల సూప్‌ అనేది మంచి దివ్య ఔషధం. ఉల్లికాడల సూప్ తాగితే దగ్గు జలుబు నుంచి కూడా మీకు వెంటనే ఉపశమనం లభిస్తుంది.ఇక ఈ ఉల్లికాడల్లో ఉండే పెక్టిన్ అనే పదార్థం పెద్ద పేగుల్లోని సున్నితమైన పొరలను కూడా రక్షిస్తుంది.దీంతో పెద్ద పేగు దెబ్బ తినకుండా, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా కూడా ఉల్లికాడ నివారిస్తుంది.


ఈ ఉల్లికాడల్లో ఉన్న గ్జియాంతిన్ అనే పదార్థం కంటిచూపుని బాగా మెరుగుపరుస్తుంది.ఉల్లికాడలను ఎక్కువగా తీసుకుంటే రక్తపోటూ, ఆస్టియోపోరోసిస్ వంటి ఎముక సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశాలు కూడా తగ్గుతాయి.అలాగే స్ప్రింగ్ ఓనియన్స్ లో ఉన్న ఫోలేట్లు గుండె జబ్బులని అదుపులో ఉంచుతాయి.ఇంకా ఈ ఉల్లికాడలు చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. కాలేయం చుట్టూ పేరుకొనే అధిక కొవ్వుని కూడా తగ్గేలా చూస్తాయి.వాటిల్లో ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్ 'సి' ఇంకా బీటా కెరొటిన్ కూడా చాలా ఎక్కువగా లభిస్తాయి.ఈ ఉల్లికాడల్లో పోషకాలు ఎక్కువ. ఇక స్త్రీ గర్భందాల్చిన మొదటి మూడు నెలల్లో తరచుగా ఉల్లికాడలను తింటే.. కడుపులో బిడ్డకు ఫోలిక్ యాసిడ్ అనేది అందుతుంది. అలాగే ఇది గర్భస్థ శిశువుకి వెన్నెముక సమస్యలను నివారిస్తుంది. అలాగే ఆటిజం వంటి ప్రవర్తనాపరమైన సమస్యలు కూడా దరిచేరవని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.ఉల్లికాడలను రసం ఒక టీ స్పూన్ ఇంకా ఒక టీ స్పూన్ తేనే కలిపి రోజూ తీసుకుంటే శరీర రోగనిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: