గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేష‌ణ‌ల స‌మ‌హార‌మే చ‌రిత్ర‌. నాటి ఘ‌ట‌న‌లను..మాన‌వుడు న‌డిచి వ‌చ్చిన బాట‌ల‌ను స్మ‌రించుకోవ‌డానికే చ‌రిత్రే. ప్ర‌పంచ మాన‌వాళి ప‌రిణామ క్ర‌మంలో సెప్టెంబ‌ర్‌12వ  ‌తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది.  హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం


ముఖ్య సంఘటనలు

1686: బీజాపూరు రాజ్యం, ఔరంగజేబుతో యుద్ధంలో ఓడిపోయి, మొఘల్ సామ్రాజ్యం కలిసిపోయింది. ఆదిల్‌షాహీ వంశ పతనం.


జననాలు

1885: గౌస్ బేగ్ సాహెబ్, పేరాల ఉద్యమంలో నెలకొల్పిన కఠోర నియమాలను పాటించి పోలిసు జులుమును భరించి క్రమశిక్షణతో సత్యాగ్రహంచేసి మునిసిపల్ శాసనాన్ని రద్దుచేయించారు
1892: తల్లావఝుల శివశంకరస్వామి ప్రసిద్ద సాహితీవేత్త. భావకవితా ఉద్యమ పోషకుడు. (మ.1972)
1920: పెరుగు శివారెడ్డి, ఆంధ్రప్రదేశ్ లోని ఒక ప్రఖ్యాత నేత్రవైద్య నిపుణుడు. (మ.2005).పెరుగు శివారెడ్డి కర్నూలు జిల్లా దిన్నెదేవరపాడు గ్రామంలో 1920, సెప్టెంబరు 12 న జన్మించారు. ఈయన తండ్రిపేరు పి.హెచ్.రెడ్డి. (పెరుగు హుస్సేన్ రెడ్డి - దర్గా దగ్గర జన్మించటంతో ఈ పేరు పెట్టడం జరిగినది) . ఆయన 1946లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి ఎం.బి.బి.యస్. (డాక్టరు) పట్టాని పొంది 1952లో నేత్రవైద్యంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం.యస్. పట్టాని స్వీకరించారు.
1925: జోలెపాళ్యం మంగమ్మ, ఆకాశవాణి మొట్టమొదటి మహిళా న్యూస్ రీడర్ (మ.2017)ఈమె చిత్తూరు జిల్లా మదనపల్లెలో 1925, సెప్టెంబరు 12న జన్మించింది. ఎం.ఎ., బి.ఎడ్ చదివింది. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టాను పొందింది. ఈమెకు తెలుగు, ఇంగ్లీషు, ఫ్రెంచ్, ఎస్పరాంటో, తమిళ, హిందీ భాషలలో ప్రావీణ్యం ఉంది.
1952: అల్లాబక్షి బేగ్ షేక్‌, రంగస్థల రచయిత, నటుడు.



మరణాలు

2009: నార్మన్ బోర్లాగ్, హరిత విప్లవ పితామహుడు.
2009: రాజ్‌సింగ్ దుంగార్పూర్, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు మాజీ అధ్యక్షుడు.
2010: స్వర్ణలత, దక్షిణ భారత గాయని. (జ.1973). ఈమె సుమారు 7000 పాటలు తమిళం, కన్నడం, తెలుగు, హిందీ, మలయాళం, ఉర్దూ, బెంగాలీ, ఒరియా, పంజాబీ, బాడిగ భాషలలో పాడి ప్రేక్షకుల మన్ననలను, ఎన్నో పురస్కారాలు పొందారు.
ఈమెకు కరుత్తమ్మ సినిమాలో పొరలె పొన్నుతాయి అనే పాటకు జాతీయ ఉత్తమ గాయని పురస్కారం లభించింది. ఈ పాటను ఏ.ఆర్.రెహమాన్ సంగీత దర్శకత్వం వహించారు.. ఈమె గాత్రం విలక్షణంగా ఉండటం వలన సంగీత ప్రపంచంలో నిలిచిపోయారు.


పండుగలు , జాతీయ దినాలు

2008 సెప్టెంబర్ 12 తేదీని మొదటిసారిగా ప్రపంచ నోటి ఆరోగ్య దినంగా ప్రకటించారు. 1978 సెప్టెంబర్ 12వ తేదీనాడు ఎఫ్ డి ఐ వరల్డ్ డెంటల్ ఫెడరేషన్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రాథమిక ఆరోగ్య రక్షణ అనే అంశంపై అంతర్జాతీయ సదస్సును నిర్వహించింది. ఎప్ డి ఐ వ్యవస్థాపకుడు డాక్టర్ చార్లెస్ గాడన్ 1854 సెప్టెంబర్ 12వ తేదీన జన్మించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: