గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేషణల సమహారమే చరిత్ర. నాటి ఘటనలను..మానవుడు నడిచి వచ్చిన బాటలను స్మరించుకోవడానికే చరిత్రే. ప్రపంచ మానవాళి పరిణామ క్రమంలో మార్చి 30వ తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం

ముఖ్య సంఘటనలు

1842: ఈథర్ ను మత్తుమందుగా అమెరికన్ శస్త్రవైద్యుడు మొదటిసారిగా ఉపయోగించాడు.
1867: అలాస్కా ను రష్యా నుంచి అమెరికా కొనుగోలు చేసింది.అలాస్కా ఉత్తర అమెరికా ఖండానికి అత్యంత వాయువ్యంగా ఉన్న భూభాగం. అలాస్కా అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఒకటి. ఈ రాష్ట్రం భూభాగపరంగా అన్ని అమెరికా రాష్ట్రాలకన్నా పెద్దది. అలాస్కా భూభాగం రష్యా నుండి అక్టోబరు 18, 1867 న ఏడు మిలియన్ డాలర్లకు కొనుగోలు చేయబడింది.  ఎక్కువ‌ పాలక మార్పుల అనంతరం జనవరి 3, 1959న అమెరికా 49వ రాష్ట్రంగా అవతరించింది. అలాస్కా తూర్పు భాగంలో కెనడా, ఉత్తర భాగంలో ఆర్కిటిక్ మహా సముద్రం, పడమట, దక్షిణంలో పసిఫిక్ మహాసముద్రం ఉన్నాయి. అలాస్కా అన్న పేరు రష్యన్ కాలనియల్ కాలంలో పరిచయం చెయ్యబడింది. దీనిని ద్వీపకల్పం అని మాత్రమే పిలుస్తూ వచ్చారు. తరువాత అలెయుట్ భాష లోని అలక్సక్ శబ్దం నుండి ఆవిర్భవించింది. అలెయుట్ భాషలో అలక్సక్ అన్న మాటకు "సముద్రపు ప్రభావానికి గురి అయ్యేది" అని అర్థం.
1929: భారత ఇంగ్లండు ల మధ్య విమాన సేవలు మొదలయ్యాయి.

ప్ర‌ముఖుల జననాలు..

1906: జనరల్ కె.ఎస్.తిమ్మయ్య: భారతదేశపు 6వ ఛీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌. (మ.1965)
1908: దేవికారాణి, భారతీయ నటి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (మ.1994)
1934: సి.ధర్మారావు, తెలుగు భాషోద్యమ నాయకుడు, గాంధేయవాది. (మ.2013)
1935: తంగిరాల వెంకట సుబ్బారావు, తెలుగు రచయిత.
1967: నగేశ్ కుకునూర్, సినిమా దర్శకుడు.

ప్ర‌ముఖుల  మరణాలు..

1971: సురభి కమలాబాయి, తొలి తెలుగు సినిమా నటీమణి. (జ.1907)
2002: ఆనంద్ బక్షి, సంగీత దర్శకుడు (జ. 1930)
2005: ఒ.వి.విజయన్, భారత దేశ రచయిత, కార్టూనిస్ట్ (జ.1930)
2011: నూతన్ ప్రసాద్, తెలుగు సినిమా రంగములో హాస్య నటుడు, ప్రతినాయకుడు. (జ.1945)
2018: దండమూడి భిక్షావతి, తొలితరం మహిళా ఉద్యమనేత, సీపీఐ (ఎం) సీనియర్‌ నాయకురాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: