చరిత్రలో మే 23 వ తేదీన పలు ప్రత్యేకతలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోండి.


చరిత్రలో ఈరోజు జరిగిన ప్రముఖ సంఘటనలు....

1984: బచేంద్రీపాల్, ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి భారత పర్వతారోహకురాలిగా అవతరించింది.

2009: ఐపిఎల్-2 విజేతగా హైదరాబాద్ దక్కన్ చార్జర్స్ నిలిచింది.

1995: జావా ప్రోగ్రామింగ్ భాష మొదటి వర్షన్ విడుదలైంది.


చరిత్రలో ఈ రోజు ప్రముఖుల జననాలు....

1707: ప్రముఖ స్వీడన్ జీవ శాస్త్రవేత్త, వైద్యుడు, ఆధునిక వర్గీకరణ శాస్త్ర పితామహుడు కరోలస్ లిన్నేయస్ జననం

1942: ప్రముఖ తెలుగు లెజండరీ డైరెక్టర్ శతాధిక చిత్రాల తెలుగు సినిమా దర్శకుడు. కె. రాఘవేంద్రరావు జన్మించారు.తెలుగు సినీ రంగములో దర్శకేంద్రుడు అని పిలువబడే శతాధిక చిత్రాల దర్శకుడు, నిర్మాత. ఆయన మే 23, 1942 తేదీన కృష్ణా జిల్లా, కంకిపాడు మండలానికి చెందిన కోలవెన్ను గ్రామంలో జన్మించారు.

1944: ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసిస్టెంట్ ఎడిటర్ (Scripts) గా శర్మ చేరాడు.

1945:ప్రముఖ సీనియర్ నటులు చంద్ర మోహన్.ఈరోజు జన్మించారు.తెలుగు సినిమా రంగంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించిన నటుడు. 1966లో రంగులరాట్నం చిత్రంతో ఇతని సినీ ప్రస్థానం ఆరంభమైంది. అప్పటినుండి సహనాయకుడిగా, నాయకుడుగా, హాస్యనటునిగా, క్యారెక్టర్ యాక్టర్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించాడు. ప్రధానంగా కామెడీ పాత్రల ద్వారా చంద్రమోహన్ ప్రేక్షకులకు చిరకాలం గుర్తుంటారు.

1945: మలయాళ భాషా రచయిత, చిత్రానువాదకుడు, చిత్రనిర్మాత పద్మరాజన్ జననం.

1954:వాసిరెడ్డి నవీన్, సాహితీకారుడు.ఈరోజు జన్మించారు.

1963:కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు.ఈరోజు జన్మించారు.

1965: ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు వై.వి.యస్.చౌదరి ఈరోజు జన్మించాడు.ఇతనొక ప్రముఖ తెలుగు సినిమా రచయిత, దర్శకుడు, నిర్మాత, పంపిణీదారుడు, ఎగ్జిబిటరు, ఆడియో కంపెనీ అధినేత. 1998వ సంవత్సరంలో అక్కినేని నాగార్జున నిర్మాణంలో "గ్రేట్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్" సంస్థలో రూపొందిన శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యాడు.


చరిత్రలో ఈ రోజు ప్రముఖుల మరణాలు...

1945: హైన్రిచ్ హిమ్లెర్, ఒక సైనిక కమాండర్, నాజీ పార్టీలో సభ్యుడు.ఈరోజున చనిపోయారు.

1953: భారతీయ జనసంఘ్ పార్టీ స్థాపించిన శ్యాంప్రసాద్ ముఖర్జీ మరణం ఈరోజున జరిగింది.


ఇక ఈ రోజు పండుగలు,జాతీయ దినాలు...

ఈరోజు ప్రపంచ తాబేలు దినోత్సవం



మరింత సమాచారం తెలుసుకోండి: