విటమిన్ బి మెండుగా ఉండే బీట్‌రూట్ చర్మం,వెంట్రుకలు, గోళ్లు ఆరోగ్యం గా ఉండటానికి బాగా
ఉపయోగపడుతుంది. అంతేకాదు పెదవులు పొడి ఆరకుండానూ చూస్తుంది. వీటిల్లోని బీటేన్
రక్తనాళాలు పెళుసుబారకుండా కాపాడుతుంది. అందుకే బీట్ రూట్ ని ఎక్కువగా తీసుకోవడం
వల్ల ఆరోగ్యవంతమైన శరీరం మీ సొంతం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా బీట్
రూట్ వల్ల కలిగే ప్రజోజనాలు ఏంటో క్రింద చూద్దాం....
*ఒక
చిన్న గ్లాస్ బీట్ రూట్ రసం రోజు తాగడం వలన రక్తపోటు తగ్గుతుంది.
*జ్ఞాపకశక్తి, కాలేయం పనితీరు మెరుగుపడటానికీ
బీట్‌రూట్ తోడ్పడుతుంది.
*గర్భిణుల్లో
ఆరోగ్యకరమైన కణజాలం వృద్ధి చెందేలా బీట్ రూట్ ఉపయోగపడుతుంది.
* బీట్‌రూట్‌లో నైట్రేట్‌ల నిల్వలు అధికంగా ఉండటం వలన ఇవి నైట్రేట్ ఆక్సైడ్‌లుగా మారి రక్తప్రసరణ వేగాన్ని
పెంచుతాయి.
*బీట్రూట్
వలన రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తాయి.
* బీట్‌రూట్
రసం తాగిన మూడు గంటలకు రక్తపోటులో తగ్గుదల ఉంటుందనీ ఓ పరిశోధనలో తేలింది.
* క్రీడాకారులు బీట్‌రూట్ జ్యూస్ తాగి పరిగెత్తినపుడు తక్కువ ఆక్సిజన్ తీసుకుంటారు. అందువల్ల త్వరగా
అలసిపోరు.
*పరుగుల పోటీలో పాల్గొనేవారి వేగాన్ని, వారి యొక్క సామర్థ్యాన్ని బీట్‌రూట్
పెంచుతుంది.
*పైగా బీట్ రూట్ లో విటమిన్ ఏ అధికంగా కూడా ఉంటుంది.
*బీట్ రూట్ తీసుకోవడం ద్వారా మనవ రక్తంలో చిక్కదనం కూడా పెరుగుతుంది.
*పైగా బీట్ రూట్ తినడంవల్లా నిగనిగలాడే కాంతివంతమైన చర్మం మన సొంతం అవుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి