దోసకాయ రసంలో నిమ్మరసాన్ని చేర్చి అందులో పసుపు, మెత్తటి సెనగపిండిని చేర్చి ముఖానికి పట్టించి, పది నిమిషాలు తర్వాత ముఖాన్ని కడిగితే ముఖవర్చస్సు, సౌందర్యం, మృదుత్వం పెరుగుతాయి. తలకు నిమ్మరసాన్ని మర్ధనా చేసినట్లయితే మాడుపోటు తగ్గుతుంది. నిమ్మరసంలో సోడాను కలపి తాగితే ఆసిడిటీ నివారణకు తోడ్పడుతుంది.        ఉసిరి రసం, నిమ్మరసం కలపి తలకు పట్టిస్తే వెంట్రుకలు రాలటాన్ని నివారిస్తుంది. నిమ్మరసంలో తేనెను కలిపి తీసుకుంటే నాలుక పిడుచకట్టుకుపోవడం, గొంతు ఎండిపోయినట్లువ్వడం తగ్గిపోతుంది. చలువ చేస్తుంది. చర్మానికి మృదుత్వాన్ని కలిగిస్తుంది.        కందిరీగ, తేనేటీగలాంటివి కుట్టనప్పుడు ఆ బాధను నివారించడానికి నిమ్మ చిప్పతో చర్మం మీద ఆ ప్రదేశంలో రుద్దాలి. గోరుచుట్టు ఏర్పడినప్పడు నిమ్మకాయను వేలుకు సిరిపడా పై వైపు గుండ్రంగా కట్ చేసి, వేలుకు టోపీలా తొడిగినట్లయితే, నొప్పిని నివారించడమే కాక గోరుచుట్టు కూడా తగ్గిపోతుంది.        నిమ్మరసంలో చిటికెడు పసుపు కలిపి మొటిమల మీద ఆరారగా రాస్తుంటే మొటిమలు తగ్గతాయి. గోరువెచ్చని నీళ్ళల్లొ చిటికెడు ఉప్పు, నిమ్మరసాన్ని కలిపి పాదాల పగుళ్లకు నివారణ కలుగుతుంది. నిరాహార దీక్షలో ఉన్నవారు దీక్షను విరమించేటప్పుడు మొదటి నిమ్మరసాన్నే తాగుతారు.          వేవిళ్లలతో బాధపడే గర్బిణీ స్త్రీలకు, అనారోగ్యం నుంచి కోలుకుంటున్న వారికి నిమ్మరసంతో తయారు చేసిన చట్నీని కానీ, అన్నంలో కలుపుకుని తింటే నోటి హితవు కలుగుతుంది. గోరింటాకు పొడితోకొంచెం నిమ్మరసాన్ని కలపి, చేతులకు పెట్టుకుంటే చేతులు ఎర్రగా పండుతాయి.            రక్తనాళాలు గోడలకు బలాన్ని చేకూరుస్తుంది. ఎండిన నిమ్మచిప్పలను మెత్తని పొడిచేసి సున్నిపిండిలో కలిపి ఒళ్లు రుద్దుకుంటే చర్మం కాంతిగా ఉంటుంది. ఎండిన నిమ్మచిప్పల పొడి, ఉప్పు కలిపి ఫళ్లు తోముకుంటే పళ్లు తెల్లగానూ ఆరోగ్యంగానూ ఉంటాయి. ఆహార పధార్థాలల్లో నిమ్మరసాన్ని చేర్చడం ఆరోగ్యకరం.  

మరింత సమాచారం తెలుసుకోండి: