ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నారింజ రంగుల్లో ఉండే క్యాప్సికమ్ నేడు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ లభిస్తోంది. క్యాప్సికమ్ తో తయారుచేసే వంటలు చాలా ఫేమస్. ఇది పచ్చిమిర్చిలా ఘాటుగా కాకుండా, తక్కువ కారంతో రుచిగా ఉంటాయి. అయితే ఆరోగ్య సంరక్షకుల ప్రకారం రోజుకు 11% విటమిన్ B6 అవసరం కాగా క్యాప్సికం ఆ అవసరాన్ని తీరుస్తుందట. క్యాప్సికమ్‌లో విటమిన్ ‘ఎ,సి’ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని డైట్‌లో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి.


ఆకుపచ్చ, పసుపు క్యాప్సికమ్‌లో కన్నా ఎరుపు క్యాప్సికమ్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, వాపు తగ్గించే గుణాలు ఎక్కువ. ఇవి ప్రొస్టేట్, గర్భాశయ, బ్లాడర్, క్లోమ గ్రంథి క్యాన్సర్‌ను నివారిస్తాయి. క్యాప్సికమ్‌లోని ఫినోలిక్స్, ప్లేవోనాయిడ్స్ శరీరంలో ఎలర్జీని తగ్గిస్తాయి. అంతేకాకుండా ఒళ్ళు నొప్పులకు, నరాల నొప్పులకు క్యాప్సికం బాగా పనిచేస్తుందని కొంతమంది ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


 మధుమేహ వ్యాధిగ్రస్తులు క్యాప్సికమ్‌ను తమ ఆహారంలో భాగం చేసుకుంటే రక్తంలోని చక్కెర స్థాయిలను సులువుగా తగ్గించుకోవచ్చు. ఇన్సులిన్‌ను ఎక్కువగా ఉత్పిత్తి చేసే చర్యలను ఇది ప్రోత్సహిస్తుంది. క్యాప్సికమ్‌లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇవి కంటి ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. అలాగే దీని వల్ల జుట్టు ఉత్పత్తి బాగా అవ్వడమే కాకుండా, జుట్టు ఊడిపోవడం కూడా తగ్గుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: