ఈ మధ్య కాలంలో అర్ధరాత్రి ఇంటికి చేరి, కాస్త తిని నిద్రలోకి జారుకునేవాళ్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఉరుకుల పరుగుల జీవితంలో సరైన సమయానికి ఆహారాన్ని తినే వారి సంఖ్య రోజురోజుకు తగ్గుతోంది. రాత్రి పూట ఆలస్యంగా ఆహారం తీసుకునేవారు త్వరగా బరువు పెరుగుతారని దీర్ఘకాలిక రోగాల బారిన పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 
 
నిపుణులు రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేసే వారిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. మాంసాహారం తినేవాళ్లలో క్యాన్సర్ వచ్చే అవకాశం మరీ ఎక్కువగా ఉందని పరిశోధనలో తేలింది. పరిశోధకులు రాత్రి 9 గంటలకు ముందే డిన్నర్ ముగించే వాళ్లలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని చెబుతున్నారు. అలా కాకుండా రాత్రి 9 గంటల తరువాత తిని పడుకునే వారిలో క్యాన్సర్ వచ్చే లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లు తేలిందని చెబుతున్నారు. 
 
పరిశోధకులు తినే సమయానికి క్యాన్సర్ కి సంబంధం ఉందని చెబుతున్నారు. కొందరు క్యాన్సర్ రోగుల జీవన శైలిని పరిశీలించినపుడు వాళ్లలో చాలామంది లేటుగా తినే అలవాటు ఉన్నవాళ్లే అని పరిశోధకులు చెబుతున్నారు. ఆలస్యంగా భోజనం చేయటం వలన గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీలైతే రాత్రి సమయంలో పడుకోబోయే మూడు గంటల ముందు ఆహారం తీసుకునే ప్రయత్నం చేస్తే మంచిదని చెబుతున్నారు. పడుకోబోయే మూడు గంటల ముందు ఆహారం తీసుకుంటే నిద్ర కూడా సరిగ్గా పడుతుందని నిపుణులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: