వేసవి వచ్చిందంటే చాలు.. ఎక్క‌డ చూసినా పుచ్చకాయలే ద‌ర్శ‌నిమిస్తుంటాయి. ఉష్ణతాపంతో ఉపశమనమే కాకుండా ఆరోగ్యాన్నిచ్చే ఈ పుచ్చ‌కాయకు మార్కెట్‌లో మాంచి డిమాండ్ ఉంటుంది. ఈ సీజ‌న్‌లో ఎక్కువ‌గా ల‌భించే పుచ్చ‌కాయ‌ల‌ను నిత్యం తింటే శ‌రీరానికి చ‌ల్ల‌ద‌నం ల‌భిస్తుంది. నీరు ఎక్కువగా ఉండే పుచ్చకాయలో పొటాషియం, ఎలక్ట్రోలైట్లు అధికంగా లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. పుచ్చ‌కాయ‌లు స‌రే.. వాటిలోని గింజ‌ల మాటేంటి..? నిజానికి పుచ్చ‌కాయ‌లే కాకుండా.. వాటిలో ఉండే గింజ‌ల‌తో కూడా ఎన్నో ఆరోగ్య‌ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. 

 

పుచ్చ‌కాయ గింజ‌ల‌ను సేక‌రించి వాటిని ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడిని నీటిలో కలుపుకుని రోజుకి మూడుసార్లు చొప్పున కొన్నిరోజుల పాటు తాగితే  కిడ్నీ స్టోన్లు త్వ‌ర‌గా క‌రిగిపోతాయ‌ట‌. అంతేకాదు, ఆ స్టోన్లు మ‌ళ్లీ వ‌చ్చే అవ‌కాశం ఉండ‌ద‌ని కూడా ఆయుర్వేదం చెబుతోంది. పుచ్చ గింజల్లోనూ అనేక పోషకాలు ఉన్నాయి. వీటిలో విటమిన్-బి అధికంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల గుండె జబ్బుల ముప్పు నుంచి బయటపడొచ్చు.

 

అలాగే పుచ్చపండు గింజలు యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉండి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి యవ్వనంగా కనపడేలా చేస్తాయి. అంతేకాకుండా, ఈ విత్తనాలను తీసుకోవటం వలన చర్మ క్యాన్సర్ మరియు ఇన్ఫెక్షన్ వంటి చర్మ రుగ్మతలకు దూరంగా ఉంచుతుంది. హైబీపీ ఉన్న‌వారు పుచ్చ‌కాయ విత్త‌నాల‌ను తింటే బీపీ కంట్రోల్ అవుతుంది. మ‌రియు మెద‌డు ప‌నితీరు మెరుగ్గా ఉండాలంటే పుచ్చ‌కాయ విత్త‌నాల‌ను రోజూ తినాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: