క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో లాక్‌డౌన్ కొన‌సాగుతున్నందున పేద‌లు నిత్యావ‌స‌రాల‌కు ఇబ్బందులు ప‌డ‌కుండా ఉండేందుకు 12కిలోల‌ రేష‌న్ బియ్యాన్ని ఉచితంగా అంద‌జేయాల‌ని తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. వారం రోజులుగా బియ్యం స‌ర‌ఫ‌రాపై పెద్ద క‌స‌ర‌త్తే చేసిన అధికారులు శుక్ర‌వారం హైద‌రాబాద్ మిన‌హా మిగ‌తా అన్నీ జిల్లాల్లో పంపిణీని ప్రారంభించారు.  2.80 కోట్ల మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేసేలా పౌర సరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. గురువారం ఉదయం  కరీంనగర్‌లో ఆ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పంపిణీని ఆరంభించారు. మిగిలిని జిల్లాల్లో వారీవారీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేలు బియ్యం పంపిణీని ప్రారంభించారు. 

 

అయితే ఇలా ప్రారంభించిన కొద్దిసేప‌టికి నిలిపివేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి ఆజ్ఞ‌లు వెలువ‌డ్డాయి.  మధ్యాహ్నం మూడు గంటలకు రాష్ట్ర పౌరసరఫరాల కార్యాలయం నుంచి వచ్చిన అత్యవసర ఆదేశాల నేపథ్యంలో రేషన్‌ డీలర్లు బియ్యం పంపిణీ ప్రక్రియను నిలిపివేశారు. బియ్యం పంపిణీ నిలిపివేతకు గ‌ల నిర్ధిష్ట కార‌ణాల‌ను మాత్రం రాష్ట్ర ప్ర‌భుత్వం వెల్ల‌డించ‌లేదు. అయితే అధికారుల అభిప్రాయం ప్ర‌కారం కొన్ని చోట్ల ఉచిత బియ్యం కావడంతో జనాలు ఎగబడ్డారు. 20మందికి మించి రావద్దని విన్నవించినా వందల సంఖ్యలో ఎగబడటంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇంకా చాలా చోట్ల ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండానే పంపిణీ జ‌రిగింది.  

 

ఈ సంఘ‌ట‌న‌ల‌తో ఉన్న‌తాధికారులు ప‌రిస్థితి క‌రోనా వ్యాప్తికి అనుకూలంగా మారేలా ఉంద‌ని ఆందోళ‌న చెందారు. దీంతో తాత్క‌లికంగా వెంట‌నే నిలిపివేయాల‌ని ఆదేశాలు జారీ చేసిన‌ట్లు స‌మాచారం. ఇదిలా ఉండ‌గా మ‌రో కార‌ణాన్ని కూడా అధికారులు వెల్ల‌డిస్తున్నారు. అదేమంటేచాలా జిల్లాల్లో ఇంకా పూర్తి స్థాయిలో బియ్యం రేషన్‌ దుకాణాలకు సరఫరా కాలేదని, ఈ దృష్ట్యా అందరికీ ఒకేసారి ఇవ్వాలన్న కారణంతోనే నిలిపివేసి ఉంటారని ఒక అధికారి తెలుపగా, కేంద్ర ప్రభుత్వం 5 కిలోలు ఉచితంగా బియ్యం ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో దానిపై స్పష్టత వచ్చాక 12 కిలోల బియ్యం సరఫరా చేయాలని ప్రభుత్వం భావిస్తోందని మరో అధికారి చెప్పారు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: