సగ్గుబియ్యం.. ఇవి తెలియ‌ని వారుండ‌రు. వండక ముందు తెల్లగా వండిన తరువాత పారదర్శకంగా ఉండే ఈ స‌గ్గుబియ్యం ఆరోగ్యానికి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ముఖ్యంగా వేసవికాలంలో మ‌న శ‌రీరానికి చ‌ల్ల‌ద‌నాన్నిచ్చే ప‌దార్థాల్లో స‌గ్గుబియ్యం కూడా ఒక‌టి. అంతేకాదు.. స‌గ్గుబియ్యంతో అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు పొందొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సగ్గుబియ్యం అంటే వెజిటేరియన్ ప్రొసెస్డ్ ఫుడ్. అందువల్లే వ్రతాల సమయం లొ దీనిని ఎక్కువగా వాడతారు.

 

పాలు తరువాత చిన్న పిల్లలకి తినిపించదగిన ఆహార పదార్ధం స‌గ్గుబియ్యం అన‌డంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇది పిల్లలకు మంచిగా జీర్ణం అయ్యే ఫుడ్. స్టార్చ్ శాతం ఎక్కువగా ఉండి కృత్రిమ తీపి పదార్ధాలు అలాగే రసాయనాలు లేకపోవడం వల్ల సగ్గు బియ్యానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. వీటిని డైట్ లో చేర్చుకుంటే రోజంతా గడిచినా ఎనర్జిటిక్ గా ఉంటారు. మ‌రియు వీటిలో కార్బొహైడ్రేట్స్ శరీరానికి కావాల్సిన మోతాదులో ఉంటాయి. కాబ‌ట్టి బ‌రువు త‌గ్గాల‌నుకునే వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.

 

అలాగే స‌గ్గుబియ్యం త‌గిన మోతాదులో తీసుకుంటే గ్యాస్ ప్రాబ్లమ్స్, బ్లోటింగ్ వంటి సమస్యలను తక్షణం నివారిస్తాయి. మ‌రియు  ఇందులో శరీరానికి కావాల్సిన ఖనిజాలన్నీ ఉన్నాయి. ఎంతగా అంటే.. ఎలక్ట్రోలైట్స్ అని మనం తీసుకునే ఖనిజాలన్నీ కూడా సగ్గుబియ్యంలో మనకి కనిపిస్తాయి. అవి మ‌న ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి. మ‌రో విష‌యం ఏంటంటే.. సగ్గుబియ్యంలో క్యాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల బ్లడ్‌ ప్రెజర్‌ని కూడా కంట్రోల్‌ చేస్తుంది. సో  వీటిని కూడా అప్పుడ‌ప్పుడు తింటూ ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి: