ప్ర‌స్తుతం క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌ను ప‌ట్టిపీడిస్తున్న సంగ‌తి తెలిసిందే. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైర‌స్ అనాతి కాలంలోనే దేశ‌దేశాలు విస్త‌రించింది. ఈ క్ర‌మంలోనే అనేక మంది ప్ర‌జ‌ల ప్రాణాల‌ను బ‌లితీసుకుంటుంది. ఇక క‌రోనా సోకి హాస్ప‌ట‌ల్‌లో ప్రాణాల‌తో పోరాడుతున్న సంఖ్య ల‌క్ష‌ల్లో ఉంది. దీంతో క‌రోనా అంటేనే ప్ర‌జ‌లు ఆమ‌డ‌దూరం పారిపోతున్నారు.  కరోనా వైరస్‌కి మందు లేదు. నివారణ ఒక్కటే మార్గం. ఈ క్ర‌మంలోనే చాలా మంది మాస్కులను, హ్యాండ్ శానిటైజర్లను ఎక్కువగా వాడుతున్నారు. అందులోనూ ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో హ్యాండ్ శానిటైజర్‌ డిమాండ్ అనూహ్యంగా పెరిగింది.  

 

చక్కగా రెండు, మూడు చుక్కలు చేతిలో వేసుకుని.. దాన్ని రెండు చేతులకూ రుద్దుకుంటే మన చేతులు క్లీన్ అయిపోయినట్లు భావిస్తాం.  నీరు లేని చోట ఇది బెస్ట్ ఆప్షన్‌లా అనిపిస్తుంది. అంతేకాదు.. కొందరు చేతులు కడగడంతో పాటు శానిటైజర్‌ను కూడా వాడేస్తున్నారట. అయితే ఏదైనా అతిగా వాడితే అది ప్రాణాల‌కే ముప్పు తీసుకువ‌స్తుంది. అందుకు హ్యాండ్ శానిటైజర్ కూడా మిన‌హాయింపు కాదంటున్నారు నిపుణులు. అవును! శానిటైజర్లను అతిగా వాడడం వల్ల చర్మ సంబంధమైన సమస్యలు వస్తాయంటున్నారు. పరిశుభ్రమైన నీరు, సబ్బుతోనే చేతులు కడుక్కోవడం మంచిద‌ని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

 

మ‌రియు హ్యాండ్ శానిటైజర్ లో 75 శాతం వరకు ఆల్కహాల్ కు మండే అవకాశం ఉంటుంది. దీన్ని ఉపయోగించినప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఇక హ్యాండ్ శానిటైజర్ లో చాలా హానికరమైన రసాయనాలు కూడా ఉంటాయి. అందుకే మీరు ఆహారం తీసుకునే ముందు మీరు కచ్చితంగా చేతులు కడుక్కోవాలి. కాబ‌ట్టి అతిగా హ్యాండ్ శానిటైజ‌ర్ వాడ‌డంలో జాగ్ర‌త్త‌లు వ‌హించండి. ఇక  ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి చెందుతుండటం వల్ల ప్రతి ఒక్కరూ తమ చేతులను శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కనీసం 20 సెకన్ల పాటు సబ్బుతోనే చేతులు శుభ్రపరచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: