
అయితే రోగ నిరోధక శక్తి పెంచే పదార్థాలు ఇంగువ కూడా ఒకటి. ప్రతి రోజు ఇంగువను డైట్లో చేర్చుకోవడం వల్ల శరీరంలో భయంకర రోగాలతో పోరాడే రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది. అలాగే ఇంగువలో ఉండే యాంటీ బయాటిక్, యాంటీ వైరల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు శ్వాస సమస్యలు, పొడి దగ్గు, ఆస్తమా వంటి సమస్యలను సులువుగా నివారిస్తాయి. రోగ నిరోధక శక్తి పెంచడయే కాదు.. ఇంగువను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చు. ముఖ్యంగా దంతాల నొప్పి, తలనొప్పి, స్టొమక్ ప్రాబ్లెమ్స్ మరియు చెవి నొప్పి వంటి సమస్యలను తగ్గిస్తుంది.
అలాగే ఇంగువ శరీర కణాలను ఫ్రీ రాడికల్స్ నుండి కాపాడుతుంది. క్యాన్సర్ కణాలకు నిరోధించడంలోనూ ఇంగువ గ్రేట్‌గా సహాయపడుతుంది. తలనొప్పిగా ఉన్నప్పుడు, ఒత్తిడిగా ఫీల్ అయినప్పుడు ఒక కప్పు మరిగించిన నీళ్లలో చిటికెడు ఇంగువ వేసి తాగితే మంచి ఉపశమనం లభిస్తుంది. ప్రతిరోజు క్రమం తప్పకుండా రాత్రి నిద్రించే ముందు తీసుకుంటే.. మలబద్ధకం సమస్యకు ఈజీగా చెక్ పెట్టవచ్చు. అదేవిధంగా, మహిళలకు నెలసరి సమయంలో వచ్చే నొప్పులను కూడా ఇంగువ సమర్థవంతంగా తగ్గిస్తుంది. ముఖ్యంగా నెలసరి సమయంతో ఇంగువను బెల్లంతో తీసుకుంటే పొత్తి కడుపు నొప్పి తగ్గుతుంది. ఇక చక్కెర స్థాయిలను అదుపు చేయడంలోనూ, రక్త పోటును కంట్రోల్ చేయడంలోనూ ఇంగువ సహాయపడుతుంది. కాబట్టి, ఖచ్చితంగా మీ డైట్లో ఇంగువను చేర్చుకోండి.