విటమిన్ సి గాయాలను త్వరగా నయం చేస్తుందని అధ్యయనాల్లో తేలింది.విటమిన్ సి మీ చర్మ సంరక్షణకు కావలిసిన యాంటీఆక్సిడెంట్ గా పని చెయ్యడమే కాకుండా ఇంకా చాలా విధాలుగా చర్మాన్ని రక్షిస్తుంది. కాబట్టి ఇది మీ రోజు వాడే స్కిన్ కేర్ వస్తువుల్లో తప్పనిసరిగా ఉండాలి. ఇందులో ఎక్కువగా యాసిడ్ కంటెంట్ ఉండటం వల్ల కొల్లాజెన్ మరియు ఎలాస్టిన్ ఉత్పత్తిని వేగవంతం చేస్తుంది. దీని వల్ల చర్మ సమస్యలు ఏవైనా దానికదే నయం చేసుకుంటుంది.
యాంటీఆక్సిడెంట్ స్థాయిలను పెంచడం, రక్తపోటును తగ్గించడం, రోగనిరోధక శక్తిని పెంచడం, అంటువ్యాధుల నుండి చర్మాన్ని రక్షించడం వంటి మరెన్నోగొప్ప ఆరోగ్య ప్రయోజనాలు విటమిన్ సి తీసుకోవడం వల్ల కలుగుతాయి. “విటమిన్ సి టాబ్లెట్స్ వేసుకోవడం రోగనిరోధక శక్తిని పెంచే గొప్ప మరియు సరళమైన మార్గం. మీ ఆహారంలో ఈ యాంటీఆక్సిడెంట్ తక్కువగా ఉంటే వీటిని ఉపయోగించమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా మీ రోగనిరోధక శక్తిని పెంచే సులభమైన మార్గాలలో ఒకటి విటమిన్ సి తీసుకోవడం. విటమిన్ సి నీటిలో కరిగే విటమిన్, దీన్ని ఆహారం ద్వారా లేదా మందుల ద్వారా తీసుకోవాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి