ప్రస్తుత కాలంలో వారి వారి ఆహారపు అలవాట్ల కారణంగా చాలామంది, అధిక బరువుకు గురి అవుతున్నారు. మరికొంతమంది ఎంత ఫుడ్ డైట్ కంట్రోల్ లో ఉన్నప్పటికీ స్థూలకాయం ఏర్పడుతోంది. ఫలితంగా వారు ఆశించిన స్థాయిలో ఉండలేకపోతున్నామని తీవ్ర మనస్థాపానికి గురి అవుతున్నారు. ఇక బరువు తగ్గించుకోవాలని ఎన్నో జిమ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ అలసిపోతున్నారే తప్పా,వారి శరీర బరువులో  ఏ మాత్రం తేడా కనిపించడం లేదు. అంతేకాకుండా ఎన్నో ఎక్సర్సైజులు, వ్యాయామాలు చేస్తూ అలసిపోతున్నారు. ఏది చేసినప్పటికీ ఒక నియమ నిబంధనలు అనేవి తప్పనిసరిగా ఉండాలి. అయితే ఇప్పుడు చెప్పబోయే కొన్ని చిట్కాలను పాటించి, అధిక బరువును తగ్గించుకోండి.

అధిక బరువును జయించాలి అంటే, సబ్జా గింజలు ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ సబ్జా గింజలు తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న వేడి కూడా క్రమంగా తగ్గిపోతుంది. అంతేకాకుండా వీటిలో ఉండే పోషకాలు మన శరీరంలో ఎలాంటి నష్టం జరగకుండా ఆపుతాయి.  సబ్జా గింజలు నేటితరం అని కాకుండా పూర్వం నుంచే వీటి వాడకం ఆచరణ లో ఉంది. కాబట్టి సబ్జాగింజలు దేశి సూపర్ ఫుడ్ గా పిలవబడుతున్నాయి . అయితే వీటిని ఎలా తాగాలో ఇప్పుడు తెలుసుకుందాం.

సబ్జా గింజలను ఒక టేబుల్ స్పూన్ తీసుకొని,గ్లాస్ నీటిలో నానబెట్టడం వల్ల గింజల పరిమాణం రెండింతలవుతుంది. వాటిని తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది. ఇలా సబ్జా గింజలను గంట సేపు నానబెట్టి, తాగడం వల్ల క్రమంగా బరువు తగ్గుతారని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సబ్జా గింజలలో ఆల్ఫా లినోలెనిక్ ఆమ్లం పుష్కలంగా ఉంటుంది. అలానే అధిక మొత్తంలో ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు లభిస్తాయి. ఇవి శరీరంలో కొవ్వును కరిగించి, జీవక్రియను పెంపొందించడానికి ఎంతగానో సహాయపడతాయి.

ఇక సబ్జా గింజలలో ఫైబర్ అధిక మొత్తంలో ఉండడం కారణంగా ఆకలి మందగిస్తుంది. సబ్జా గింజలు తినడం వల్ల త్వరగా ఆకలి వేయదు. క్రమంగా ఆహారం వైపు దృష్టి మళ్లడం తప్పుతుంది. అంతేకాకుండా సబ్జా గింజల లో పిండిపదార్థాలు తక్కువగానూ ప్రోటీన్లు ఎక్కువగానూ ఉంటాయి. మరీ ముఖ్యంగా వేసవికాలంలో సబ్జా గింజలు తీసుకోవడం వల్ల అధిక బరువు తగ్గడమే కాకుండా, వేడి తాపాన్ని కూడా తగ్గించుకోవచ్చు. ఏదిఏమైనప్పటికీ బరువు తగ్గాలని అనుకొనే వారు సబ్జా గింజల్ని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు చేకూరుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: