మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే పోషకాలు కలిగిన ఆహారం మాత్రం తీసుకుంటే సరిపోదు. మనం ఆరోగ్యంగా జీవించడానికి ఆక్సిజన్ కూడా అంతే అవసరం. ప్రస్తుతం మనం గడుపుతున్న జీవనశైలిలో, మనకు స్వచ్ఛమైన ఆక్సిజన్ ఎక్కడా దొరకడం లేదు. ప్రస్తుతం కొన్ని అగ్రజ దేశాలు ఆక్సిజన్ ని కూడా అమ్ముతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇలాంటి ఆక్సిజన్ ముందుగా మనం శరీరంలో అన్ని భాగాలకు అందేలా చూడాలి. మనం మామూలుగా పీల్చే శ్వాస ద్వారా వెళ్లే ఆక్సిజన్,శరీరంలో అన్ని భాగాలకు అందుతుందో?లేదో? కూడా తెలియని పరిస్థితిలో వుంటున్నారు చాలామంది. అయితే ఇప్పుడు చెప్పబోయే కొన్ని వ్యాయామాల ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ ను చక్కగా అందించగలం.. అయితే వ్యాయామాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా సగటు వ్యక్తి 500 మిల్లీ లీటర్ల గాలిని మాత్రమే తీసుకోగలుగుతారు. కానీ మన ఊపిరితిత్తులకు దాదాపు రెండున్నర లీటర్ల గాలిని తీసుకోగలిగే అవకాశం ఉంటుంది. మనం కనుక సంకల్పించి,పూర్తిగా గాలిని తీసుకుంటే, మొత్తం ఐదు లీటర్ల గాలిని పీల్చ వచ్చని డాక్టర్లు చెబుతున్నారు. శ్వాస క్రియ ద్వారా మనం పీల్చే గాలి పరిమాణం పెరిగితే, జీవకణాలకు ఆక్సిజన్ ఎక్కువగా అందుతుంది. జీవ కణాలు శక్తివంతంగా తయారయ్యాయి అంటే మనం ఆరోగ్యంగా ఉన్నట్టు అని అర్థం.
ప్రాణాయామంతో పాటు శరీర కండరాలు కూడా బాగా బిగించడం,వదలడం చేయడం ద్వారా శక్తివంతం చేయవచ్చు. ప్రాణాయామం చేసినప్పుడు శరీర భాగాలను ముఖ్యంగా ఉదర భాగాన్ని పైకి,కిందకి కదిలిస్తూ ఉంటే శక్తిని పొంది ఆరోగ్యంగా ఉండవచ్చు. అయితే ఈ ప్రాణాయామం చేసేటప్పుడు మనం కొన్ని ఆరోగ్య నియమాలను పాటించాల్సి ఉంటుంది. ప్రాణాయామం చేసేటపుడు ఉదయం పూట చేస్తే మరింత ప్రయోజనం చేకూరుతుంది. గ్రౌండ్ లో, పార్కుల్లో, తలుపులు తెరిచి ఉన్న ప్రదేశంలో కూర్చొని ప్రాణాయామం చేయాలి.
కానీ గాలి విపరీతంగా వీచే ప్రదేశాలలో ప్రాణాయామం చేయకూడదు. మురికిగా,దుర్వాసన వస్తున్న చోట, పొగ వస్తున్న చోట ప్రాణాయామం చేయకూడదు. అలాగే పొట్ట నిండుగా, మన చుట్టూ సిగరెట్, బీడీ పొగలు వస్తున్న చోట ప్రాణాయామం చేయకూడదు. ఏదైనా తిన్న వెంటనే కూడా ప్రాణాయామాలు చేయకూడదు.
సరైన పద్ధతిలో ఈ ప్రాణాయామాన్ని పాటించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం..
ప్రాణాయామం చేయడం వల్ల ఊపిరితిత్తుల పనితీరు పెరిగి, శ్వాస సంబంధిత రోగాలను నయం చేసుకోవచ్చు. ఆస్తమా ఉన్నవారు కూడా ప్రాణాయామం చేయడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది.
ప్రాణాయామం వల్ల బరువు కూడా తగ్గుతారు.
ప్రాణాయామం వల్ల శరీరంలోని అన్ని అవయవాలు శుభ్రపడి,మలినాలను బయటకు నెట్టి వేస్తాయి.
శరీర అవయవాలను శుభ్రపరచడంలో ఎన్నో పద్ధతులు ఉన్నప్పటికీ, అందులో ప్రాణాయామం ఎంతగానో ఉపయోగపడుతుంది.
డిప్రెషన్ కు గురి అయినప్పుడు, బాగా ఒత్తిడి పెరిగినప్పుడు ఈ ప్రాణాయామం కీలకపాత్ర పోషిస్తుంది.
అంతేకాకుండా వ్యాధినిరోధకతను పెంపొందించుకోవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి