గోధుమ పిండితో తయారుచేసిన ఆహార పదార్థాలను మనము తింటాం అని మనకు తెలుసు. కానీ గోధుమ రవ్వతో చేసే ఆహారాలు తినడం వల్ల కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాకుండా బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే గోధుమ రవ్వ లో తక్కువ కేలరీలు ఉంటాయి. పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. అందుకే గోధుమ రవ్వ ను ఆహారాల్లో ఇంకా చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ప్రయోజనాలు ఏమిటో  ఇప్పుడు చూద్దాం...                                                         

 గోధుమ రవ్వ తో తయారు చేసిన ఆహారం తీసుకోవడం వల్ల చాలా సేపు ఆకలి వేయదు. స్నాక్స్ బదులు రవ్వతో చేసిన పదార్థాలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. క్రమంగా  బరువు కూడా తగ్గుతారు.

 జీర్ణ వ్యవస్థ సక్రమంగా జరగడానికి చేసిన ఆహార పదార్థాలు బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే గోధుమ రవ్వ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అంతేకాకుండా శరీరంలోని అన్ని అవయవాలను ఆరోగ్యంగా ఉంచటానికి సహాయపడుతుంది.

 గోధుమ రవ్వతో చేసిన ఆహార పదార్థాలను తినడం వల్ల తీసుకున్న ఆహార పదార్థాలను చెక్కరగా మారకుండా చేయడమే కాకుండా బ్లడ్ షుగర్ లెవెల్స్ ని అదుపు  చేస్తుంది. అందుకే తగ్గాలి అనుకునే వాళ్ళు గోధుమ రవ్వ ను  ఉపయోగించడం చాలా మంచిది.

 గోధుమ  రవ్వతో చేసిన ఆహారాలను తీసుకోవడం వల్ల జీర్ణక్రియ  నెమ్మదిగా జరిగి త్వరగా ఆకలి వేయకుండా చేస్తుంది. దీంతో  తక్కువ తింటారు. ఫలితంగా బరువు తగ్గే అవకాశం ఉంది.

 గోధుమ రవ్వలో క్యాలరీలు  చాలా తక్కువగా ఉంటాయి. ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే గోధుమ రవ్వ ను తీసుకోవడం వల్ల బరువు తేలికగా తగ్గుతారు. దీంతోపాటు ఆరోగ్యం బాగుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: