ఆరోగ్యం కోసం ఎన్నో రకాల మూలికలను వాడుతూ ఉంటాము. వీటివల్ల ఎన్నో లాభాలు కూడా ఉంటాయి. అలాంటి మూలికలలో గలిజేరు మొక్క ఒకటి. ఈ మొక్క వర్షాకాలంలో బాగా పెరుగుతుంది. ఈ మొక్కను ఆయుర్వేదంలో పునర్నవ అని అంటారు. ఈ మొక్కను ఆయుర్వేద మందుల్లో టీ ని తగ్గించే ఔషధాలు లో వాడుతారు. అంతేకాకుండా దాన్ని శుద్ధి చేసే మందుల్లో కూడా ఈ మొక్కను వాడుతారు. గలిజేరు మొక్క మూడు రకాలుగా ఉంటుంది. తెలుపు, ఎరుపు నలుపు. మూడు రకాల్లో నూ ఔషధ గుణాలు మాత్రం ఒకటే ఉంటాయి. కానీ తెల్ల గలిజేరు లో ఎక్కువగా ఔషధ గుణాలు ఉంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. గలిజేరు మొక్క ఏ విధంగా ఉపయోగపడుతుంది. ఏ అనారోగ్యాలను నయం చేస్తుంది. ఆరోగ్యంగా ఉండటానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు తెలుసుకుందాం...

 కఫము,  దగ్గు, శరీరంలో ఏర్పడే వాపులు, వాపు  వ్యాధులు, కడుపుకు  సంబంధించిన వ్యాధులు, కాలేయపు వాపును, గుండెకు సంబంధించిన వ్యాధులు, ఇవన్నీ తగ్గడానికి తెల్ల గలిజేరును వేడి నీటిలో  బాగా మరగనిచ్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగడం వల్ల ఈ వ్యాధులన్నీ తగ్గిపోతాయి.

 రేచీకటి తో బాధ పడుతున్న వాళ్ళు తెల్ల గలిజేరు వేరును అరగదీసి కంటికి పెట్టడం వల్ల రేచీకటి తొలగిపోవడమే కాకుండా, కంటి చూపు మెరుగుపడుతుంది. అలాగే చెట్టు ఆకు ను ఉడకబెట్టుకొని తినడంవల్ల రక్తం శుభ్రపడుతుంది. రక్తాన్ని వృద్ధి కూడా చేస్తుంది.

 కామెర్లు వచ్చినప్పుడు తగ్గడానికి తెల్ల గలిజేరు మొక్క బాగా ఉపయోగపడుతుంది. గలిజేరు మొక్క ఆకుల రసం తీసుకొని 10 గ్రాముల పెరుగులో కలిపి ఉదయం, సాయంత్రం తాగడం వల్ల కామెర్లు తగ్గిపోతాయి.  ఇలా మూడు రోజులు వాడాలి.

 తెల్ల గలిజేరు ఆకులను పిడికెడు తీసుకొని బాగా కడిగి పావులీటరు నీటిలో వేసి బాగా మరగనివ్వాలి. చల్లారిన తర్వాత వడగట్టి రోజు ఉదయం పరగడుపున ఒక గ్లాసు తాగడం వల్ల కిడ్నీలు బాగా శుభ్రం అవుతాయి. అంతేకాకుండా మూత్రనాళ సమస్యలు తగ్గుతాయి. ఈ కషాయం తాగిన అర గంట వరకు ఏమీ తినకూడదు. కానీ ఈ విధంగా 21 రోజులు తాగాలి. అప్పుడు మంచి ఫలితం ఉంటుంది.

 పిచ్చి కుక్క కాటుకు కూడా తెల్ల గలిజేరు మొక్క  బాగా ఉపయోగపడుతుంది. ఎలాగంటే తెల్ల గలిజేరు వేరు, ఉమ్మెత్త వేరును కలిపి ముద్దగా నూరి తినడం వల్ల విషం విరిగిపోతుంది.

 తెల్ల గలిజేరు వేరు, నీరు, పాలు సమానంగా కలిపి పాలు మిగిలే దాకా బాగా మరగనివ్వాలి. చల్లారిన తరువాత వడగట్టి తాగడం వల్ల సర్వ జ్వరాలు హరిస్తాయి.

 వాతం నొప్పులు, కీళ్ల నొప్పులు ఉన్నచోట గలిజేరు మొక్కను బాగా నూరి రసం తీసుకోవాలి. ఆ రసంలో నువ్వుల  నూనె కలిపి నూట మిగిలే వరకు బాగా మరగనివ్వాలి. మిగిలిన నూనెను నొప్పులు  ఉన్న చోట రాయడం వల్ల నొప్పులు తగ్గిపోతాయి. అంతేకాకుండా తెల్ల గలిజేరు ఆకులను ముద్దగా నూరి ముఖానికి అప్లై చేయడం వల్ల మచ్చలు తొలగిపోతాయి.

 ఈ ఆకులను అతిగా తినకూడదు తీవ్రమైన హృద్రోగం  తో బాధపడుతున్న వాళ్ళు డాక్టర్ సలహాతో తీసుకోవాలి. డయాబెటిస్, అధిక రక్తపోటు ఉన్నవాళ్లు  మితంగా తీసుకోవాలి. పాలు ఇచ్చే తల్లులు, గర్భిణీ స్త్రీలు ఈ ఆకు తినకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి: