ప్రస్తుత కాలంలో జుట్టు రాలే  సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. శీతాకాలంలో గాలి వీచడం వల్ల జుట్టులోని తేమ లేకుండా పోతుంది. అందుకే జుట్టు బలహీనపడి  ఎక్కువగా రాలిపోతుంటుంది. అంతేకాకుండా చుండ్రు సమస్య, జుట్టు విచ్చిన్న మవడం జరుగుతూ ఉంటుంది. సమస్యలు నివారించడానికి ఎన్నో రకాల క్రీములు, షాంపూలు వాడుతూ ఉంటారు. కానీ ఫలితం మాత్రం ఉండదు. దీనికితోడు ఇంకా అనేక సమస్యలు కూడా ఎదురవుతుంటాయి. కాబట్టి సహజమైన వాటితో జుట్టు  రాలడాన్ని నిర్మించుకోవచ్చు. జుట్టు రాలడాన్ని తగ్గించడానికి ఉండే వాటితోనే సాధ్యపడుతుంది. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం...

 మెంతులను బాగా నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. అందులోకి కొంచెం ఆవనూనె లేదా కొబ్బరి నూనె కలిపి తలంతా బాగా అప్లై చేయాలి. ఒక గంట తర్వాత నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల రాలడం తగ్గడమే కాకుండా, జుట్టు మృదువుగా ఉంటుంది.

 జుట్టు  రాలడాన్ని తగ్గించడానికి ఉల్లిపాయ ఎంతో ఉపయోగపడుతుంది. ఉల్లిపాయను బాగా దంచి రసం  తీసుకొని ఆ రసాన్ని తలపై బాగా మసాజ్ చేయాలి. కొద్దిసేపు తర్వాత తేలికపాటి షాంపూతో స్నానం చేయండి. ఇలా వారానికి మూడు సార్లు చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. అంతేకాకుండా జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.

 జుట్టు ఎక్కువగా రాలుతున్న వాళ్లు, పొడి జుట్టు ఉన్న వాళ్ళు కొద్దిగా ఆవనూనె తీసుకొని బాగా వేడి చేయాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు తలంతా బాగా మసాజ్ చేయాలి. తర్వాత తడిగుడ్డ తీసుకొని చిట్టి ఒక గంట సేపు అలానే ఉండనివ్వండి. ఆ తర్వాత తలస్నానం చేయడం వల్ల జుట్టు రాలడం  తగ్గిపోతుంది..

 కలబంద జెల్ ను తీసుకొని అందులోకి కొద్దిగా కొబ్బరి నూనె కలిపి తలకు బాగా అప్లై చేసి 30  నిమిషాల తర్వాత గోరు  వెచ్చని నీటితో తేలిక షాంపూతో తల  స్నానం చేయాలి. ఇలా చేయడంవల్ల జుట్టుకు కావలసిన పోషకాలు అందడమే కాకుండా, జుట్టు మృదువుగా, కాంతివంతంగా ఉంటుంది.

 జుట్టుకు గుడ్డు వాడడం వల్ల బాగా పెరగడమే కాకుండా, పోకుండా ఉంటుంది. గుడ్డులోని తెల్ల సొన తీసుకొని అందులోకి  కొంచెం పెరుగు వేసి  జుట్టుకు  బాగా అప్లై చేసి ఒక గంట తర్వాత తల స్నానం చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల జుట్టు బలోపేతమవుతుంది. అంతేకాకుండా  జుట్టు  ఆరోగ్యంగా పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: