యాలకులను మసాలా దినుసులలో ఒకటిగా ఉపయోగిస్తూ ఉంటారు. వీటిని ఎక్కువగా సువాసనను వెదజల్లే మూలిక గా ఉపయోగిస్తారు. నాటి నుంచి నేటి వరకు వీటిని ఎక్కువగా స్వీట్ పదార్థం లో ఉపయోగించడం చూసే ఉంటాము. వీటిని వాడడం వల్ల మంచి రుచితో పాటు సువాసన కూడా వస్తుంది. అయితే వీటిని ఎలాగయినా సరే ఉపయోగించి మనం అనేక అనారోగ్య సమస్యల నుండి  తప్పించుకోవచ్చని అంటున్నారు నిపుణులు. అయితే అవి ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం..


యాలకులను పొడి చేసుకొని, అల్లం పొడి,సోంపు గింజల పొడి లను చిటికెడు మోతాదులో తీసుకొని కలపాలి. అనంతరం ఆ మిశ్రమం ఒక టేబుల్ స్పూన్ కు మించకూడదు. అలాగే చిటికెడు ఇంగువను కూడా కలుపుకోవాలి. వీటన్నింటినీ కలిపి ఒక కప్పు నీటిలో కలిపి, తాగితే గ్యాస్ సమస్య ఉండదు. తలనొప్పి, అజీర్తి సమస్యలు ఉన్నవారు యాలకులతో టీ చేసుకొని తాగడం వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది. అజీర్ణ సమస్యతో బాధపడేవారు రోజుకు రెండుసార్లు యాలకుల పొడిని,సోంపు గింజల పొడిని గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగడం వల్ల సుఖ విరేచనం అవుతుంది.


అరటి పండ్లతో, యాలకులు కలిపి తింటే వాంతులు,వికారం తగ్గుతుంది. అలాగే గ్లాసు గోరువెచ్చని పాలలో ఒక టేబుల్ స్పూన్ తేనె,కొద్దిగా యాలకులు పొడి కలిపి తాగితే మగవారిలో అంగస్తంభన సమస్య ఉండదు. ఇక ఎక్కిళ్ళు మరీ ఎక్కువగా వచ్చి బాధిస్తుంటే, నీటిలో యాలకులు, పుదీనా ఆకులు వేసి ఐదు నిమిషాల పాటు బాగా మరిగించి,ఆ నీటిని తాగితే ఎక్కిళ్లు తగ్గుతాయి.


అలాగే దంతాల నొప్పితో బాధపడుతున్న వారు అతిమధురం,యాలకుల పొడిని కలిపి తేనెతో ఒక టేబుల్ స్పూన్ చొప్పున తింటూ ఉంటే, త్వరగా ఉపశమనం కలుగుతుంది. అలాగే ఒక గ్లాసు నీటిలో, కొద్దిగా యాలకుల పొడి,  దాల్చిన చెక్క పొడి, వేసి మరిగించి అందులో కొద్దిగా ఉప్పు వేసి తాగుతూ ఉంటే గొంతు సమస్యలు పోతాయి. యాలకుల పొడి లో ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి రోజుకు ఒక సారి తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. అంతేకాకుండా విరేచనాలను కూడా తగ్గించే శక్తి యాలకులకు ఉంది. అలాగే  కడుపు నొప్పి వంటి సమస్యను కూడా దూరం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: