ఓట్స్ ను రోజు ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల బరువు తగ్గడానికి అవకాశం ఉంది. కొవ్వు కరిగించడానికి ఓట్స్ బాగా దోహదపడతాయి. రోజూ ఓట్స్ తీసుకోవడం వల్ల 25 నుండి 35 గ్రాముల ఫైబర్ శరీరానికి అందుతుంది. అందుకే ఓట్స్ను తమకు క్రమం తప్పకుండా తీసుకోవాలి.
శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి గ్రేయిన్ బార్లీ, ఓట్స్ వంటివి తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ను తొలగిపోతుంది. ఫలితంగా గుండె సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఇవి బాగా సహాయపడతాయి.
ఆవకాడోలో మోనో శ్యాచురేటెడ్ ఫ్యాట్ అధికంగా ఉంటుంది. దీనివల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే వీటిని తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది.
బరువు తగ్గడానికి, కొవ్వు తగ్గించుకోవడానికి బీన్స్ చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే బీన్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందుకే బీన్స్ తీసుకోవడం వల్ల కొవ్వు కరిగిపోతుంది.
పండ్లు బాగా తీసుకోవడం వల్ల చెడు కొవ్వు పదార్థాల స్థాయిని తగ్గిస్తాయి. అలాగే ఆహారం కూడా సులువుగా జీర్ణమవుతుంది. ముఖ్యంగా ఆపిల్, గ్రేప్స్, స్ట్రాబెరీ, సిట్రస్ వంటే పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల చెడు కొవ్వు పెరగకుండా ఉంటుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి