అయితే ద్రాక్ష పండ్లలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు మనుషుల్లో వచ్చే వృద్ధాప్య ఛాయలను తొలగించి నిత్య యవ్వనంగా ఉండేందుకు తోడ్పాటునందిస్తాయి. ఇక ఈ పండ్లను తినడం ద్వారా రక్తంలో నైట్రిన్ ఆక్సైడ్ మోతాదులు పెరుగుతాయి. తద్వారా రక్తనాళాలలో రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది. అలా గుండెపోటు నివారణకు దోహదపడుతుంది. నల్ల ద్రాక్షలో ఉండే కొన్ని రకాల పోషకాలు క్యాన్సర్ కారకాలతో పోరాడుతాయని వైద్యులు తెలిపారు.
అంతేకాక నల్లద్రాక్షలో ఉండే ఫైటోకెమికల్స్ గుండెలో పేరుకునే చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి అక్కడి కండరాలకు మేలుచేస్తాయి. అలా హృద్రోగాలను కూడా దూరం చేస్తాయట. ఇక నల్ల ద్రాక్ష పండ్లను తినడం వల్ల శరీరం బరువును కూడా తగ్గించుకోవచ్చు. ఊబకాయంతో బాధపడుతున్నవారు నల్ల ద్రాక్షను తరచుగా తీసుకోవడం ద్వారా.. రక్తంలో కొలెస్ట్రాల్ ఏర్పడకుండా ఆపుతుంది. తద్వారా ఊబకాయం వంటి ఇతర ఆరోగ్య సమస్యలను కూడా ఇది నివారిస్తుంది.
అలాగే మనుషుల్లో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరిగేందుకు సహకరిస్తుంది. మైగ్రేన్ వంటి వ్యాధుల నుంచి కూడా బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. నల్ల ద్రాక్ష పండ్లను క్రమం తప్పకుండా తినడం వల్ల మధుమేహం కూడా కంట్రోల్‌లోకి వస్తుందట. నల్ల ద్రాక్ష బ్లూబెర్రీస్ మాదిరిగానే రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. మరియు ఇది కేవలం పాలీఫెనాల్స్, ఆస్కార్బిక్ ఆమ్లం కాదు. వృద్ధాప్యం, అల్జీమర్స్ వ్యాధి, తాపజనక ప్రక్రియలు ఇతర సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. నల్ల ద్రాక్ష ఆహారాన్ని జీర్ణం చేసే ప్రక్రియలో పాల్గొనే ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. గ్యాస్ట్రిక్ చలనశీలతను నియంత్రిస్తుంది
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి