ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా తప్ప మరే పేరు వినిపించడం లేదు. కరోనా వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురి అయినటువంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఇక సెకండ్ వేవ్ లో అయితే ఆక్సిజన్ అందక మరణించిన వారు చాలా మంది ఉన్నారు. అందుకే ప్రభుత్వాలు కరోనా తన పంజాను పూర్తిగా విసరకముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని , అంటూ పలు సూచనలు చెబుతుంటారు. అంతేకాకుండా ఎక్కువ కేసులు నమోదైన చోట లాక్ డౌన్ కూడా పెట్టే ఛాన్స్ ఉంటుంది..

మన చుట్టూ ఉండే పరిసరాలు, వాటి మార్పుల వల్ల మన దగ్గర కరోనా దరిచేరదు అని కూడా చెప్పవచ్చు. తెల్లారితే చాలు..ఆక్సిజన్ కొరత తో ఎంతో మంది చనిపోతున్నారు అనే వార్తలు మనం చూస్తూనే ఉన్నాము. ఎండాకాలంలో వేడి పెరుగుతూ ఉంటే, ఆ గాలిలో ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది. దాంతో మనకు గాలి ఆడడం లేదు అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. ఊపిరిపీల్చుకున్నా , ఏదో సరిపోవట్లేదు అనే భావన కలుగుతుంది మనలో.. దీన్ని ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడం అంటారు. అందుకే మన ఇళ్లలో, పరిసరాల చుట్టూ ఆక్సిజన్ మొక్కలు పెంచుకోవాలి. ఈ మొక్కలు చాలా ఎక్కువ ఆక్సిజన్ ను గాలిలోకి వదులుతాయి.
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఓ నర్సరీ యజమాని ఈ విషయాన్ని గుర్తించాడు. ఈ మొక్కలు చూడటానికి చాలా అందంగా ఉండడమే కాకుండా ఈ మొక్కలు ఆరోగ్యాన్ని కూడా పెంచుతాయని అంటున్నారు.ఈ మొక్కల ధర రూ.50 నుంచి రూ.500 మధ్య ఉంటుంది. ఈ నర్సరీ మొక్కలను రోజుకు 80 నుంచి 90 దాకా చాలా మంది వచ్చి ఆక్సిజన్ మొక్కలు ఇంటికి తీసుకువెళ్తున్నారట. అయితే కొంతమంది ఎక్కువ ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు రాత్రివేళ ఎక్కువ కార్బన్డయాక్సైడ్ విడుదల చేస్తాయని, అది ప్రమాదకరమని ఒక పుకారు లేపారు. అలాంటివి నమ్మకండి .అలా జరగదు.. పగలైనా, రాత్రయినా అవి ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి. ముఖ్యంగా మనీప్లాంట్ అంటారా అది కూడా 24 గంటలూ ఆక్సిజన్ ను రిలీజ్ చేస్తూనే ఉంటుంది. ఇక ఈ మొక్కలు కూడా అంతే .. వీటి వల్ల ఎలాంటి హాని కలగదు.

ఆక్సిజన్ మొక్కలను ఇంటిలో పెంచుతుంటే ఉదయంవేళ తప్ప ఇక రోజంతా వాటికి ఎండ తగలకుండా చూసుకోవాలి. వీటికి వారానికి రెండు సార్లు మాత్రమే నీరు పోయాలి. అదనంగా నీరు పోసినా అవి తాగవు. ఈ ఆక్సీజన్ ను ఉత్పత్తి చేసే ఈ మొక్కల ఫోటోలను మీరు కూడా ఒకసారి చూసేయండి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి