మామిడి పండ్లను ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. ముఖ్యంగా ఈ వేసవికాలంలో దొరికే మామిడి పండ్లు తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మామిడి పండ్లు వేసవి కాలము లోనే వస్తాయి. అందుకని ఈ సీజన్లో వాటిని తప్పకుండా తినాలి. ఇక వీటితో అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఇక మామిడి ఆకుల విషయానికి వస్తే , వీటి ద్వారా కూడా మనకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఆ ఆకులను ఉపయోగించి , మనము పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. అవి ఏమిటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

ఇందుకోసం ఒక పాత్రలో తగినంత నీటిని తీసుకొని , అందులో కొన్ని మామిడి ఆకులను వేయాలి. వాటిని బాగా మరిగించడం వలన నీరు రంగు మారుతుంది. ఆ నీరు చల్లారిన తరువాత దాన్ని వడగట్టి తాగాలి. ఇలా మామిడి ఆకులతో తయారు చేసిన నీటిని తాగడం వల్ల అనారోగ్య సమస్యలు నయం చేయవచ్చు.

1). మామిడిపళ్ళలాగా మామిడాకులలోనూ పోషకాలు అధికంగా ఉంటాయి. విటమిన్ సి,ఏ లు ఆకులలో పుష్కలంగా లభిస్తాయి.

2). విరేచనాల సమస్యతో బాధపడుతున్నవారు మరిగించిన మామిడి ఆకుల నీటిని తాగడం వల్ల ఆ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.

3). మామిడి ఆకులలో  యాంటిఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వలన, ఇది మన శరీరానికి ఎంతో ఉపయోగపడతాయి. చర్మ వ్యాధుల నుంచి ఇన్ఫెక్షన్ రాకుండా కూడా చూస్తాయి.

4). మామిడి ఆకులను బాగా కాల్చి ,ఆ ఆకును గాయాల పైన కట్టాలి. అలా కట్టు తీసిన వెంటనే ఆ భాగాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి
 దీనిద్వారా గాయాలు త్వరగా మానిపోతాయి.

5). దగ్గు సమస్య ఉన్నవారికి మామిడాకులు ఎంతో మేలు చేస్తాయి.

6). మామిడి ఆకులు కాల్చడం వలన వాటి నుంచి వెలువడే పొగ పీల్చడం ద్వారా వెక్కిళ్ల ను తగ్గించవచ్చు.

7). మామిడాకుల ద్వారా హైబీపీని కూడా తగ్గించవచ్చు . వీటిని  రసం చేసుకొని ప్రతి రోజూ రెండు సార్లు తాగడం వలన మంచి ఫలితం లభిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: