పుచ్చకాయలు తినడం అంటే అందరికీ ఇష్టమే..ఎందుకంటే తియ్యగా ఉంటాయి.. చూడటానికి నోరు ఉరిస్తాయి. అంతే కాదు వీటిలో ఎన్నో రకాల మినరల్స్ ఉంటాయి.. విటమిన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా పుచ్చకాయలలో ఎక్కువ నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. వేసవి కాలంలో విరివిగా దొరుకుతాయి. దాహార్తిని తీర్చేందుకు పుచ్చకాయలను తీసుకుంటారు.పుచ్చకాయలో పొటాషియం, ఐరన్, కాల్షియం, రాగి, మెగ్నీషియం, విటమిన్ ఎ, విటమిన్లు బి 1, బి 6, సి, డి, లైకోపీన్ వంటి పోషకాలు ఉంటాయి. అందుకే వీటిని తీసుకోవడం మంచిదని న్యూట్రీషన్లు అంటున్నారు..


ఇన్ని పోషకాలు ఉన్న ఈ పుచ్చకాయల ను ఎలా పడితే అలా తినకూడదట.. ఒక క్రమ పద్ధతిలో తినడం వల్ల చాలా పోషకాలు అందుతాయి.. పుచ్చకాయలను తినడం వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 


ప్రయోజనాలు.. 

ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బరువు తగ్గాలని భావించే వారు వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది..

ఇందులో ఉండే విటమిన్ ఎ, సి రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. విటమిన్ బి 6 ఐరన్ ఎర్ర రక్త కణాలను పెంచుతాయి. ప్రతిరోధకాలను తయారు చేయడంలో కూడా సహాయపడతాయి.

వీటికి అరుగుదల శక్తి ఎక్కువగా ఉంటుంది.. జీర్ణవ్యవస్థను కూడా బలపరుస్తుంది. అందులో లభించే 92 శాతం నీరు మలబద్ధకం సమస్యను తొలగించడానికి సహాయపడుతుంది..

ఎల్‌డిఎల్ అనే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. రక్త నాళాలలో కొవ్వు నిల్వలు రాకుండా చేస్తుంది. ఇది గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఇకపోతే పుచ్చకాయలు తీసుకోవడానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.. 

మాములుగా ఏవి తిన్నా మితంగా తింటే ఆరోగ్యానికి మంచిది..రోజుకు 400-500 గ్రాముల పుచ్చకాయను తీసుకుంటే సరిపోతుంది. అతిగా తినడం వల్ల సమస్యలు వస్తాయి. అలాగే లూస్ మోషన్, గ్యాస్, అపానవాయువు, విరేచనాలు అవుతాయి..

పుచ్చకాయ తిన్న తర్వాత నీరు తాగకూడదు. ఎందుకంటే ఈ పండ్లలో అప్పటికే చాలా నీరు, ఫ్రక్టోజ్ ఉంటుంది. అటువంటి పరిస్థితిలో జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు.కాగా, రాత్రికి పుచ్చకాయ తింటే బరువును పెంచుతుంది. అలాగే కడుపు సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు..డయాబెటిస్ రోగులు పుచ్చకాయను పరిమిత పరిమాణంలో తీసుకోవాలి లేదా శరీరంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది... అలాగే ఆల్కహాల్ తీసుకునేవారు పుచ్చకాయలను తినకపోవడంమంచిది..

చూసారుగా పుచ్చకాయలను తీసుకోవడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో.. ఇప్పటి నుంచి పుచ్చకాయలను డైట్ లో చేర్చుకోవడం మర్చిపోకండి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: