ఇక దేశంలో కోవిడ్ 19 విలయ తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. చాప కింద నీరు లాగా ఈ కరోనా ఉధృతి పెరుగుతుందే తప్ప ఏమాత్రం తగ్గడం లేదనే చెప్పాలి.రోజుకి 4 లక్షలు తగ్గకుండా కేసులు విపరీతంగా పెరిగిపోతూ వున్నాయి. ఇక చాలా చోట్ల అధికారులు ఏమి చెయ్యలేక చేతులు ఎత్తేస్తున్నారు.ఇక కోవిడ్ సెకండ్‌ వేవ్ మహమ్మారి ఉప్పెనలా విజృంభిస్తున్న ఈ సమయంలో హాస్పిటల్‌కు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి కోలుకునే వారి సంఖ్యను పెంచడానికి మెరుగైన ఆహారమే మార్గమని ప్రభుత్వం అభిప్రాయపడింది. కరోనా రోగులకు ఖచ్చితంగా రోగ నిరోధక శక్తి చాలా అవసరం అని కేంద్రం సూచించింది.సరైన ఆహారం తీసుకుంటే 80 నుంచి 85 శాతం రోగులు ఇంట్లోనే కోలుకుంటున్నట్లు ఆరోగ్య శాఖ స్పష్టం చేయడం జరిగింది.కోవిడ్ మహమ్మారి వ్యాపించిన రోగులు తీసుకోవాల్సిన ఆహారంపై కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనలు చెప్పడం జరిగింది. వారి ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే ఖచ్చితంగా వారికి తగిన స్థాయిలో విటమిన్లు, ఖనిజాలు శరీరానికి అందాలి.అవి అందాలి అంటే ఖచ్చితంగా ఇవి తినాలి.


విటమిన్లు, ఖనిజాలు అందడానికి ఐదు రకాలు పండ్లు, కూరగాయలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలని కేంద్రం సూచించింది.కోవిడ్ ఆందోళనను అదుపులో ఉంచుకోవడానికి 70 శాతం కొకొవా ఉన్న డార్క్ చాక్లెట్లు కొద్ది మొత్తంలో తినాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి ప్రతి రోజూ ఒకసారి పసుపు పాలు తాగాలని సూచించింది. ప్రతిరోజూ తక్కువ మొత్తంలో ఎక్కువసార్లు ఆహారం తీసుకోవాలని చెప్పింది. ఆహారంలో ఆమ్‌చూర్ (మామిడి పొడి) ఉండేలా చూసుకోవాలి. రాగి, ఓట్స్‌ లాంటి తృణధాన్యాలు, ప్రొటీన్ ఎక్కువగా అందించే చికెన్‌, ఫిష్‌, గుడ్లు, పనీర్‌, సోయా, కాయగింజలు, బాదాం, వాల్‌నట్స్‌, ఆలివ్ ఆయిల్‌ బాగా తినాలని కేంద్రం సూచించింది.కాబట్టి కేంద్రం సూచించిన ఈ ఆహార పద్ధతులు ఖచ్చితంగా పాటించండి. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి: