మనం తినే ఆహారంలో ఏ కూర లోనైనా ఉల్లిపాయ పడందే ఆ కూరకు రుచి రాదు. అలాగే చాలామంది ఉల్లిపాయ లేకుండా ఏ కూరలు  చేయలేరు. ఇంకా చెప్పాలంటే చాలామంది ఉల్లిపాయ ముక్కలను అన్నంలోకి నంచుకొని తింటేనే వారికి కడుపు నిండినట్టు అనిపిస్తుంది. అంతేకాకుండా నాన్ వెజ్ తినేటప్పుడైనా లేదా ఫాస్ట్ ఫుడ్ తినేటప్పుడైనా తప్పకుండా  ఈ ఉల్లిపాయలు వుండాల్సిందే..అంతలా ఈ ఉల్లిపాయలకు  ప్రజలు అలవాటు పడిపోయారు.


ఇక ఈ ఉల్లిపాయలను కేవలం  రుచికి  మాత్రమే కాకుండా అటు ఆరోగ్య పరంగా, ఇటు సౌందర్య పరంగా కూడా ఉపయోగిస్తారు. ఇక ఎంత ఎక్కువ రేట్ అయినా సరే పెట్టి మరీ ఉల్లిపాయలను కొనితెచ్చుకుంటారు.. అయితే సాధారణంగా ఉల్లిపాయలను కూరల్లో వేస్తే, ఆ కూరకు రుచి వస్తుందో లేదో తెలియదు కానీ, ఈ ఉల్లిపాయలను కోసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా కళ్ళల్లో నీళ్ళు రావడం  ఖాయం.. అయితే దీన్ని అరికట్టాలంటే, ఇప్పుడు చాలా చిట్కాలు అందుబాటులో ఉన్నాయి.. అయితే ఇప్పుడు చెప్పబోయే ఒక చిట్కా సులభంగా, చాలా సింపుల్ గా ఉంది. అయితే ఆ చిట్కా ఏంటో చూసి తెలుసుకోండి..


ఇందుకోసం మీరు చేయవలసిందల్లా ఒక వస్త్రాన్ని తీసుకొని,  దాన్ని తడిపి, ఉల్లిపాయలు కట్ చేసే బోర్డు మీద ఉంచాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు తరగడం మొదలుపెట్టాలి.  ఇలా చేయడం వల్ల మీ కంటి వెంట ఒక చుక్క నీటి బిందువు కూడా రాదు. సాధారణంగా ఉల్లిపాయలను  తరిగినప్పుడు, అందులో నుంచి వచ్చే కొన్ని ఆమ్లాల కారణంగా కంటి వెంట నీళ్లు వస్తాయి. ఇక తడి వస్త్రాన్ని చాపింగ్ బోర్డు పై పెట్టి ఉల్లిపాయలు తరగడం వల్ల, ఉల్లిపాయలో ఉండే  ఆమ్లాలను ఆ తడిగుడ్డ పీల్చుకుంటుంది. ఫలితంగా ఉల్లిపాయలో వుండే ఆమ్లాలు కళ్ళకు చేరవు. కాబట్టి కళ్ళు మండవు. అలాగే కంటి నుండి నీరు కూడా రాదు..

చూశారు కదా ! మీరు కూడా ఉల్లిపాయలను తరిగేటప్పుడు ఈ చిన్న చిట్కాను పాటించండి.


మరింత సమాచారం తెలుసుకోండి: